భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తన కెరీర్‌లో ఎన్నో అద్భుత విజయాలు సాధించిన సానియా.. గ్రాండ్‌స్లామ్ గెలిచిన మొదటి భారతీయ మహిళ టెన్నిస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు. దాదాపు 91 వారాల పాటు డబుల్స్‌లో సానియా మీర్జా నంబర్‌వన్‌గా కొనసాగారు. ఇలా క్రీడా రంగంలో ఎన్నో అత్యున్నత స్థానాలను చేరుకున్న సానియా ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నారు. స్టార్ ప్లేయర్‌గా కొనసాగుతున్న సమయంలోనే పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ఏప్రిల్ 12, 2010న వివాహం చేసుకున్నారు. వీరికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు ఉన్నారు. ఇక అటు షోయబ్ ఇటు సానియా ఎంత బిజీగా ఉన్నా సరదాగా గడుపుతుంటారు. విహారయాత్రలకు వెళ్తూ, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.
తాజాగా సానియా తన భర్త గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షోయబ్‌లో మీకు నచ్చని అంశం ఏంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు సానియా స్పందిస్తూ.. ‘షోయబ్ చాలా ఓపికతో ఉంటాడు. ఇది నాకు నచ్చదు’ అని చెప్పుకొచ్చింది. ఇంతకీ షోయబ్ ఈ లక్షణం ఎందుకు నచ్చదని ప్రశ్నించగా.. ‘నేను షోయబ్‌ని ఏదైనా చేయమని అడిగితే.. అతను ఎల్లప్పుడూ ‘నేను చేస్తాను’ అంటూ నిర్లక్ష్యంతో బదులిస్తారు’ అంటూ చెప్పుకొచ్చారు సానియా. దీనిపై షోయబ్ స్పందిస్తూ.. ‘నేను చేయాల్సిన పనిని సరైన సమయానికి చేస్తాను’ అని బదులిచ్చారు. ఇక షోయబ్‌లో నచ్చని మరో అంశం గురించి చెబుతూ..’షోయబ్ రాత్రి పూట గురక పెడతారు’ అని చెప్పుకొచ్చారు.
దీనికి షోయబ్ స్పందిస్తూ.. ‘నేను బాగా అలసిపోయినప్పుడు మాత్రమే గురక పెడతాను’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఇండియన్ అయిన సానియా పాకిస్థాన్‌కు చెందిన మాలిక్‌ను పెళ్లి చేసుకున్న సమయంలో ఆమెపై విమర్శలు భారీ స్థాయిలో వచ్చాయి. అలాగే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరిగే సమయంలో కూడా సానియా వార్తల్లో నిలుస్తున్నారు. అవన్ని ఎలా ఉన్నా.. వీరిద్దరూ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్. మరి సానియా షోయబ్‌పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సానియా భారత పౌరసత్వం రద్దు చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్!
JUST IN: Sania Mirza to retire from professional tennis after the current season.#SaniaMirza #tennis pic.twitter.com/5XVBoUvz6a
— TOI Sports (@toisports) January 19, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.