ఇండియన్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా కన్నీళ్లు పెట్టుకుంది. తన కెరీర్‌లో ఆఖరి గ్రాండ్ స్లామ్ ఆడేసిన సానియా.. ఓటమితో తన గ్రాండ్ స్లామ్ ప్రయాణాన్ని ముగించింది. మ్యాచ్ అనంతరం తన కెరీర్- జర్నీ గురించి సానియా మీర్జా స్పందించింది. “నా ప్రొఫెషనల్ కెరీర్ మెల్ బోర్న్ లోనే ప్రారంభమైంది. 2005లో 18 ఏళ్ల వయసులో నేను సెరీనా విలియమ్స్ తో పోరాడాను. ఆ తర్వాత నేను ఇక్కడ చాలా టోర్నమెంట్లు ఆడాను. ఎన్నో అద్భుతమైన విజయాలను నమోదు చేశాను. నా గ్రాండ్ స్లామ్ కెరీర్ ని ముంగిచడానికి మెల్ బోర్న్ కంటే ఇంకో గొప్ప వేదిక దొరకదనే చెప్పాలి” అంటూ సానియా మీర్జా కన్నీళ్లు పెట్టుకుంది.
తన కుమారుడి ఎదుట తన చివరి గ్రాండ్ స్లామ్ ఆడుతానని అసలు ఊహించుకోలేదని సానియా ఎమోషనల్ అయ్యింది. సానియా కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఆస్ట్రేలియా ఓపెన్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సానియా ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సానియా మీర్జా ఇటీవలే తన కెరీర్ ను ముగించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఓపెన్, దుబాయ్ ఓపెన్ తర్వాత తాను రిటైర్మెంట్ తీసుకుంటానని ప్రకటించింది. ఆస్ట్రేలియా ఓపెన్ లో మహిళల డబుల్స్ లో సానియా నిరాశ పరచగా.. మిక్స్ డ్ డబుల్స్ లో మాత్రం రోహన్ బోపన్నతో కలిసి ఫైనల్ వరకు వచ్చింది. ఫైనల్స్ లో బ్రెజిల్ జంట చేతిలో 6-7, 2-6 తేడాతో ఓటమి పాలయ్యారు.
వచ్చే నెలలో జరిగే దుబాయ్ ఓపెన్ తర్వాత సానియా మీర్జా తన కెరీర్ ను ముంగిచనున్నారు. ఆ తర్వాత రిటైర్ అవుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇంక సానియా కెరీర్ విషయానికి వస్తే.. భారత్ లో టెన్నిస్ పై మక్కువ పెరగడానికి సానియా మీర్జా కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. టెన్నిస్ లో టీమిండియాకి ఎన్నో అద్భుతమైన విజయాలను అందించింది. 91 వారాల పాటు మహిళ డబుల్స్ నెంబర్ 1 క్రీడాకారిణిగా కొనసాగింది. తన కెరీర్ లో ఆరు గ్రాండ్ స్లాములతో కలిపి సానియా మొత్తం 43 డబుల్స్ టైటిల్స్ సాధించింది. సానియా గ్రాండ్ స్లామ్ కెరీర్ ముగియడంపై అభిమానులు నెట్టింట ఎమోషనల్ అవుతున్నారు.
“My professional career started in Melbourne… I couldn’t think of a better arena to finish my [Grand Slam] career at.”
We love you, Sania ❤️@MirzaSania • #AusOpen • #AO2023 pic.twitter.com/E0dNogh1d0
— #AusOpen (@AustralianOpen) January 27, 2023