ఆర్సీబీలోకి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. అదేంటి ఆమె టెన్నిస్ అయితే క్రికెట్ లో ఏం పని అనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా ఈ స్టోరీ చదివేయండి. సానియా ఎందుకొచ్చిందో కూడా తెలుసుకోండి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్ లో ఇది జట్టు పేరు కాదు కోట్లాదిమంది అభిమానులు మెచ్చే బ్రాండ్. ‘ఈ సాలా కప్ నమదే’ అని ప్రతిసారి ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటారు. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అది జరగలేదు. అయినా సరే కెప్టెన్ కోహ్లీతో జట్టుపై ఫ్యాన్స్ ప్రేమ అస్సలు తగ్గదు. ఇకపోతే ఈ ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ కూడా గ్రాండ్ లెవల్లో స్టార్ట్ కానుంది. రీసెంట్ గానే వేలం జరగ్గా.. టీమిండియా మహిళా స్టార్ స్మృతి మంధానని దక్కించుకున్నారు. ఇప్పుడు మరో స్టార్ ప్లేయర్ కూడా జట్టులోకి వచ్చింది. అందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆర్సీబీ అనగానే స్టార్ ప్లేయర్లతో నిండిన జట్టే గుర్తొస్తుంది. కోహ్లీ, ఏబీ డివిలియర్స్.. ఇలా చెప్పుకుంటూపోతే చాలామంది అద్భుతమైన ప్లేయర్లు ఈ జట్టు తరఫున ఆడినవాళ్లే. ఇక ఇప్పుడు ఆర్సీబీలోకి టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా వచ్చి చేరింది. అదేంటి ఆమె టెన్నిస్ ప్లేయర్ కదా.. క్రికెట్ లో ఏం పని ఉంటుంది అని మీకు డౌట్ రావొచ్చు. అయితే సానియాని మహిళా ఐపీఎల్ జట్టుకు మెంటార్ గా ఎంపిక చేసినట్లు ఆర్సీబీ అధికారికంగా అనౌన్స్ చేసింది. జట్టు జెర్సీలో ఉన్న ఫొటోతో పాటు ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆర్సీబీకి తాను మెంటార్ గా సెలెక్ట్ కావడం ఆనందంగా ఉందని సానియా చెప్పుకొచ్చింది.
ఇటీవల జరిగిన వేలంలో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధానను.. ఆర్సీబీ టీమ్.. రూ.3.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీతోపాటు సోఫీ డివైన్, హేథర్ నైట్, రేణుక సింగ్, మేగన్ స్కాట్, రిచా ఘోష్ తదితర మహిళా క్రికెటర్లు కూడా ఈ జట్టుకే ఆడనున్నారు. ఇదిలా ఉండగా మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. 23 రోజుల పాటు ఈ లీగ్ ఉండనుంది. తొలి మ్యాచ్.. గుజరాత్, ముంబయి జట్ల మధ్య జరగనుంది. మార్చి 26న ఫైనల్ పోరు ఉండనుంది. అన్ని మ్యాచులు సాయంత్రం 7:30 గంటలకే ప్రారంభమవుతాయి. ఈ లీగ్ లో దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్, యూపీ వారియర్స్ జట్లు ఉన్నాయి. మరి ఆర్సీబీ మెంటార్ గా సానియా అపాయింట్ కావడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
View this post on Instagram
A post shared by Royal Challengers Bangalore (@royalchallengersbangalore)