ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ నార్త్ఈస్ట్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 400 పైచిలుకు పరుగులు చేసిన రెండో క్రికెటర్ గా, మొట్టమొదటి ఇంగ్లాండ్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. శనివారం లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో సామ్ నార్త్ఈస్ట్ ఈ రికార్డు అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్ కు ఆదరణ తగ్గుతుందన్న వార్తలు వస్తున్న ఈరోజుల్లో.. ఈ ఇన్నింగ్స్ టెస్టు క్రికెట్ కు ప్రాణం పోసినట్లయ్యింది.
సామ్ నార్త్ఈస్ట్(450 బంతుల్లో 410 పరుగులు) ప్రభంజనంతో.. గ్లామోర్గాన్ 5 వికెట్ల నష్టానికి 795 పరుగుల భారీ స్కోరు చేసింది. 9 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన నార్త్ఈస్ట్.. ఒకవైపు వికెట్లు పడుతున్నా తన మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. జట్టు మొత్తం.. 160 ఓవర్లు ఆడితే.. తనొక్కడే.. 75 ఓవర్లు ఆడాడు.
Sam Northeast has just made it to 4️⃣0️⃣0️⃣* for Glamorgan 😱😱😱 pic.twitter.com/buo3p45q6q
— England’s Barmy Army (@TheBarmyArmy) July 23, 2022
బ్రియాన్ లారా
ఇక.. కౌంటీల్లో అత్యధిక స్కోరు బ్రియాన్ లారా పేరు మీద ఉంది. 1994లో డర్హామ్‌పై లారా 501 పరుగులు చేశాడు. ఇక.. టెస్టు క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ఏకైక ఆటగాడు బ్రియాన్ లారా. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో లారా ఈ ఘనతను సాధించాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో అప్పటికే మూడు మ్యాచ్‌లలో ఓటమి పాలైన పర్యాటక జట్టు ఇంగ్లాండ్ చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ప్రయత్నించింది. ఈ టెస్టులో లారా పరుగుల ప్రభంజనంతో గెలుపు మాట అటుంచి డ్రా కోసం యత్నించింది.
అంతకుముందు మాథ్యూ హెడెన్
Sam Northeast is one of only nine players to score 400 runs in a first-class innings 💪https://t.co/qRAZ0n4gj7 pic.twitter.com/xiMRWvWqBc
— ESPNcricinfo (@ESPNcricinfo) July 23, 2022
1994లో ఇంగ్లాండ్‌పై 375 పరుగులు చేసి టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా లారా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మాథ్యూ హెడెన్ 2003లో జింబాబ్వేపై 380 పరుగులు చేసి లారా రికార్డుని బద్దలు కొట్టాడు. దీంతో ఏడాది తిరక్కుండానే 2004లో ఏప్రిల్‌లో 400 పరుగులతో నాటౌట్‌గా నిలిచి లారా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ హెడెన్ రికార్డుని అధిగమించి.. టెస్టు క్రికెట్‌లో తనకు తానే పోటీ అని నిరూపించుకున్నాడు. అంతేకాదు పదేళ్ల తర్వాత (2004లో) అదే జట్టుపై అదే గ్రౌండ్‌లో లారా ఈ ఇన్నింగ్స్ ఆడటం విశేషం. ఈ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: వీడియో: కళ్లు చెదిరే స్టంపింగ్ చేసిన జోస్ బట్లర్.. అచ్చం ధోనీలా!
ఇది కూడా చదవండి: Mohammed Shami: ఖరీదైన కారు కొన్న మహ్మద్ షమీ.. ధర ఎంతంటే?