పాకిస్థాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ గురించి సంచలన విషయాలు బయటికొచ్చాయి. పాకిస్థాన్ జాతీయ జట్టులోకి వచ్చిన కొత్తలో తన సీనియర్ ఆటగాళ్ల నుంచి వసీం అక్రమ్‌కు ఎదురైన చేదు అనుభవాలు వెలుగులోకి వచ్చాయి. తన సీనియర్ క్రికెటర్ సలీమ్ మాలిక్ వసీం అక్రమ్‌ను మసాజ్ చేయమని ఆదేశించడం.. అలాగే అతని బూట్లు, బట్టలు క్లీన్ చేయమని చెప్పడంలాంటి ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో దిగ్గజ బౌలర్‌గా, గొప్ప కెప్టెన్ పేరు తెచ్చుకున్న వసీం అక్రమ్.. ఆరంభ దశలో ఘోర అవమానాలు భరించినట్లు వెల్లడించాడు. సాధారణంగా ఏ రంగంలోనై సీనియర్లు.. జూనియర్లపై ఆజమాయిషీ చెలాయించడం సాధారణమే. జాతీయ జట్టుకు ఆడే క్రికెటర్లు సైతం ఇలాంటి కుంచిస మైండ్‌సెట్‌తో ఉంటారా? అంటూ క్రికెట్ అభిమానులు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
వసీం అక్రమ్ పాకిస్థాన్ జట్టులోకి వచ్చిన కొత్తలో సలీమ్ మాలిక్ అనే పాకిస్థాన్ కెప్టెన్.. వసీంను మాసాజ్ చేయాలని, తన షూలు, బట్టలు శుభ్రం చేయాలని డిమాండ్ చేసేవాడని, దీంతో సలీమ్ మాలిక్ అంటే తనకు కోపం అని వసీం అక్రమ్ తన బుక్‌లో పేర్కొన్నాడు. కాగా.. సలీమ్ మాలిక్ 1992 నుంచి 1995 వరకు పాకిస్థాన్ జట్టు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. అయినా.. కూడా వసీం అక్రమ్ సలీమ్‌పై అదే కోపంలో ఉండేవాడు. మైదానంలో వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగేది కాదు. కనీసం ఇద్దరూ ఒకరినొకరు చూసుకునేవారు కూడా కాదు. జట్టు కెప్టెన్‌గా ఉన్న సలీమ్ బౌలర్ వసీం వద్దకెళ్లి బంతి ఇచ్చి.. ఏదో చెప్పబోతున్నా.. వసీం అక్రమ్ అతని నుంచి బంతి లాక్కొని బౌలింగ్ వేసేందుకు సిద్దమయ్యే వాడు. కానీ.. అతను చెప్పేది అసలు వినే వాడు కదని.. పలు సందర్భాల్లో సలీమ్ మాలిక్ సైతం వెల్లడించాడు.
కాగా.. సలీమ్ మాలిక్‌పై వసీం అక్రమ్‌తో పాటు వకార్ యూనిస్ సైతం చాలా కోపంగా ఉండేవాడు. అక్రమ్-వకార్ ఇద్దరికీ సలీమ్ మాలిక్ అంటే అస్సలు పడేది కాదు. అయినా కూడా వారు ముగ్గురు కలిసి పాకిస్థాన్ తరఫున చాలా మ్యాచ్‌లు ఆడారు. 1982లో సలీమ్ మాలిక్ పాకిస్థాన్ జట్టులోకి అరంగేట్రం చేయగా.. రెండేళ్ల తర్వాత 1994లో వసీం అక్రమ్ పాక్ జట్టులోకి వచ్చాడు. కేవలం ఈ రెండేళ్ల సీనియారిటీని అడ్డంపెట్టుకుని.. సలీమ్ మాలిక్ తనను ఒక సర్వెంట్‌లా చూసేవాడని.. వసీం అక్రమ్ తన ఆత్మకథ ‘సుల్తాన్: ఏ మిర్రర్’ పుస్తకంలో పేర్కొన్నాడు.
Former Pakistan captain, Saleem Malik, has denied the allegations leveled against him by teammate Wasim Akram, stating that he does not want to discuss anything that could cause controversy.#former #captain #pakistan #karachi #newscurators pic.twitter.com/Rmr7kSEqG6
— Newscurators (@newscurators) November 26, 2022