లోకంలో తల్లి ప్రేమను మించింది మరొకటి లేదు అని నిరూపించిన సందర్భాలు అనేకం. మనిషి సృష్టిలోనే కాదు.. ఏ జీవమైనా తల్లికి బిడ్డ మీద ఉండే ప్రేమకు ఎవరు వెలకట్టలేరు. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోకపోయినా.. ఇదే సత్యం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా?. క్రికెటర్ గా ఎదగాలనుకున్న బిడ్డ కోసం.. ఓ తల్లి పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. పోనీ.. ఆ ప్లేయర్ రాణించలేదా అంటే అలాను కాదు. అమ్మ కొనిచ్చిన బ్యాట్ తో.. తొలి మ్యాచులోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు.
దేశంలో క్రికెట్ కు ఉండే క్రేజే వేరు.1983 వన్డే ప్రపంచకప్ లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన తర్వాత నుంచి.. దేశంలో క్రికెట్ క్రేజ్ పెరుగుతూ వస్తుందే కానీ తగ్గడం లేదు. ఇక 2008 లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అరంగేట్రం చేశాక దేశంలో క్రికెట్ పాపులారిటీ ఆకాశాన్ని తాకింది. యువకులందరు క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకొనేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇంట్రెస్ట్ చూపితే సరిపోదు.. అవకాశాలు రావాలి.. వచ్చినా నిరూపించుకునేలా సిద్ధమవ్వాలి. ఇటువంటి ఘటనే ఈ ఏడాది జరిగిన రంజీ ట్రోఫీలో జరిగింది. మిజోరంతో జరిగిన మ్యాచ్ ద్వారా బిహార్ కు చెందిన సకీబుల్ గనీ.. ఎవరికీ సాధ్యం కాని రికార్డును సాధించాడు.
ఇది కూడా చదవండి: సచిన్‌కు పాదాభివందనం చేసిన జాంటీ రోడ్స్!
ఫస్ట్ క్లాస్ కెరీర్ లో అరంగేట్రం మ్యాచ్ లోనే ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి ప్లేయర్ గా సకీబుల్ గనీ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాకుండా తొలి మ్యాచ్ లోనే అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్ గా కూడా సకీబుల్ గనీ నిలిచాడు. ఈ మ్యాచ్ లో 405 బంతులను ఎదుర్కొన్న గనీ 341 పరుగులు చేసి ట్రిపుల్ సెంచరీని సాధించాడు. ఇందులో 56 ఫోర్లు, 2 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ ఇన్నింగ్స్ తర్వాత సకీబుల్ గనీని.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ప్రత్యేకంగా అభినందించారు.
Sakibul Ghani became the first cricketer in the world to score a triple century in the very first match of first class cricket.Sakibul, a resident of Motihari, Bihar, has created a new world record by scoring 341 runs in the Ranji Trophy match against Mizoram!#Bihar pic.twitter.com/br9mHZHbc5
— Roushan Raj (@AskRoushan) February 18, 2022
అయితే,.. సకీబుల్ ట్రిపుల్ సెంచరీ వెనుక అతని కన్నతల్లి త్యాగం మరువలేనిది. అజ్మా ఖాటున్, మొహమ్మద్ మనన్ గనీ దంపతుల ఆరో సంతానంగా సకీబుల్ గనీ జన్మించాడు. వీరిది మధ్య తరగతి కుటుంబం. సకీబుల్ తండ్రికి ఆ ఊర్లోనే ఒక చిన్న స్పోర్ట్స్ షాప్ ఉండేది. ఆరుగురు పిల్లల బాగోగులు చూసుకునేందుకు తల్లిదండ్రులు బాగానే కష్టపడేవారు. సకీబుల్ అన్న ఫైసల్ కూడా క్రికెట్ ప్లేయరే. అతడి దగ్గరే సకీబుల్ క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు.
The talent of Sakibul Ghani of Bihar, who made a world record by scoring a triple century in his very first first-class match, is being appreciated all around. Congratulations to him for his achievement and good luck for future!! #SakibulGani pic.twitter.com/q2mnXwym5W
— Zabi Nawaz (@ZabiNawaz1) February 19, 2022
ఇది కూడా చదవండి: రషీద్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన SRH కోచ్ ముత్తయ్య మురళీథరన్
ఒకానొక సందర్భంలో బ్యాట్ కొనలేక సకీబుల్ క్రికెట్ కే దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అయితే.. కొడుకు క్రికెట్ కు ఎటువంటి ఆటంకం కలగకూడదనుకున్న తల్లి తన నగలను తాకట్టు పెట్టి అతడికి బ్యాట్లను కొనిచ్చేది. అయితే.. ఈ ఏడాది రంజీ టోర్నీలో ఆడేందుకు బిహార్ జట్టులో చోటు సకీబుల్ దక్కించుకోవడంతో మరోసారి అతడికి బ్యాట్లు అవసరం అయ్యాయి. ప్రొఫెషనల్ క్రికెట్ బ్యాట్ ఖరీదు అక్షరాలా రూ. 25 నుంచి రూ. 30 వేల మధ్య ఉంటుంది. అందుకోసం ఆమె తన బంగారు గొలుసును తాకట్టు పెట్టి మూడు బ్యాట్లను కొనిచ్చింది. ఇప్పుడు అదే బ్యాట్ తో సకీబుల్ ట్రిపుల్ సెంచరీ సాధించి.. తన తల్లి త్యాగం ఊరికే పోకుండా చేశాడు. వచ్చే ఐపీఎల్ లో ఆడటమే తన ప్రధాన లక్ష్యం అని సకీబుల్ చెప్పుకొచ్చాడు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.