Saiteja Mukkamalla: వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫైయర్స్ ఫ్లే ఆఫ్స్‌లో అమెరికా తన రెండో విజయాన్ని నమోదు చేసింది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో అమెరికా తరఫున తెలుగు కుర్రాడు సాయితేజ సెంచరీతో అదరగొట్టాడు.
ఈ ఏడాది ఇండియాలో వన్డే వరల్డ్ కప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌లో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. అయితే.. ఈ టోర్నీలో భాగం అయ్యేందుకు చిన్న జట్ల మధ్య క్వాలిఫైయర్ టోర్నీ నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆ టోర్నీ జరుగుతుంది. వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ ప్లే ఆఫ్ టోర్నీలో కెనడా, నమీబియా, అమెరికా, యూఏఈ, పీఎన్‌జీ, జెర్సీ దేశాలు పాల్గొంటున్నాయి. గురువారం అమెరికా, యూఏఈతో తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత సంతతికి చెందిన తెలుగు కుర్రాడు సాయితేజ రెడ్డి దుమ్మురేపాడు. ఏకంగా సెంచరీతో అమెరికాను ఒంటి చేత్తో గెలిపించాడు. సాయితేజ హిట్టింగ్ ముందు యూఏఈ బౌలర్లు చేతులు ఎత్తేశారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. ఆసిఫ్ ఖాన్ 84 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 103 పరుగులు చేసి రాణించాడు. అలాగే వన్‌డౌన్ బ్యాటర్ అరవింద్ 57 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక 280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా.. 49 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. అమెరికా వన్‌డౌన్ బ్యాటర్ సాయితేజ రెడ్డి 114 బంతుల్లో 11 ఫోర్లతో 120 పరుగులు చేసి నాటౌట్‌గా అమెరికాను గెలిపించాడు. అతనికి తోడుగా కెప్టెన్ పటేల్ 50 పరుగులతో రాణించాడు. అయితే 18 ఏళ్ల తెలుగు కుర్రాడు అమెరికా తరఫున ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడటంపై క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా తరఫున ఇప్పటి వరకు 10 వన్డేలు ఆడిన సాయితేజ 271 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. మరి సాయితేజ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
What a win for USA! 🔥
Saiteja Mukkamalla’s unbeaten ton helps them beat UAE to notch up their second win of the tournament 💪
Watch the @cricketworldcup Qualifier Play-off LIVE and for FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺
📝 https://t.co/LqQKYQjNdb pic.twitter.com/aaUqOOkLkG
— ICC (@ICC) March 30, 2023