మహామహులకే సాధ్యం కాని ఒక రికార్డును ఓ అనామక ప్లేయర్ సాధించాడు. టీ20ల్లో ఎవరూ ఊహించని విధంగా డబుల్ సెంచరీ బాదేశాడు.
క్రికెట్లో టీ20 ఫార్మాట్ వచ్చాక అనూహ్య మార్పులు వచ్చేశాయి. ఆటలో మునుపటి కంటే వేగం మరింతగా పెరిగిపోయింది. భారీ స్కోర్లను అవలీలగా కొట్టేస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన జట్లే కాదు.. ఛేజింగ్ చేసే టీమ్స్ కూడా ఎంత పెద్ద టార్గెట్లను అయినా ఛేదిస్తున్నాయి. ఫ్లాట్ పిచ్‌లు, గేమ్‌లో రూల్స్ అన్నీ కూడా బ్యాటింగ్ ఫేవర్‌గా మారిపోయాయి. దీంతో బ్యాటింగ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. అందుకే టీ20ల్లో నీళ్లు తాగినంత సులువుగా బ్యాటర్లు సెంచరీలు బాదేస్తున్నారు. ముఖ్యంగా టీ20 లీగ్‌ల్లో సెంచరీలు కామన్‌గా మారిపోయాయి. బ్యాటర్లు ఏడెనిమిది ఓవర్లు క్రీజులో ఉంటే చాలు.. వాళ్లు సెంచరీలు కొట్టకుండా ఆపలేని పరిస్థితి. అయితే సెంచరీలు కొడుతున్నా పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకు ఎవరూ డబుల్ సెంచరీ చేయలేదు.
టీ20ల్లో డబుల్ సెంచరీ చేసే సత్తా ఉన్న స్టార్ బ్యాటర్లు ఎందరో ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒకరిద్దరు మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. ఇప్పుడీ లిస్టులో మరో బ్యాట్స్‌మన్ చేరాడు. ఒక పాకిస్థాన్ బ్యాటర్ ఈ ఘనతను సాధించాడు. పాక్‌కు చెందిన సైఫ్ బాదర్ 67 బాల్స్‌లో ఏకంగా 224 రన్స్ చేశాడు. యూఎస్ఏలోని స్థానిక టీ20 మ్యాచ్‌లో క్లేరియన్ కౌంటీ ఈగల్స్ తరఫున బరిలోకి దిగిన సైఫ్.. డబుల్ సెంచరీతో రికార్డుల్లోకి ఎక్కాడు. అతడి ఇన్నింగ్స్‌లో 33 సిక్సులు, 2 ఫోర్లు ఉన్నాయంటే బ్యాటింగ్ డామినేషన్ ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. సైఫ్ చేసిన 224 రన్స్‌లో 206 రన్స్ కేవలం బౌండరీలు, సిక్సుల ద్వారా రావడం గమనార్హం. సైఫ్ వీరబాదుడుతో క్లేరియన్ కౌంటీ ఈగల్స్ ఈ మ్యాచ్‌లో 166 రన్స్ తేడాతో గెలుపొందింది.
Pakistani Saif Badar smashed 224 runs in just 67 deliveries in a Local T20 match in USA with the help of 33 sixes, 2 fours and a strike rate of 334. pic.twitter.com/AMHLSRzSxh
— Economy.pk (@pk_economy) May 2, 2023