నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజకీయాల్లోకి రాకముందు పెద్ద పారిశ్రామిక వేత్తగా ఉన్న విషయం తెలిసిందే. వ్యాపార రంగంతో పాటు సినీ ప్రముఖలతోనూ ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణకు రఘురామ వీరాభిమాని. ఆయనతో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో వేదికను పంచుకున్నారు. ఇక 2014లో రాజకీయాల్లోకి వచ్చిన రఘురామ.. తొలుత వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లారు. బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన.. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలో చేరి.. నర్సాపురం నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి గెలుపొందారు. రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఉన్న రఘురామ కృష్ణంరాజుకు దేశవ్యాప్తంగా ప్రముఖలతో పరిచయాలు ఉన్నాయి.
టీమిండియా మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు, ఇండియన్ క్రికెట్ గాడ్ అయిన సచిన్ టెండూల్కర్‌తో కూడా రఘురామ కృష్ణంరాజు మంచి సాన్నిహిత్యం ఉంది. వారిద్దరూ గతంలో కలిసి దిగిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సచిన్‌తో పాటు రఘురామ స్వీట్ తింటున్న ఫొటో.. నెట్టింట్లో సందడి చేస్తోంది. సచిన్ లాంటి వరల్డ్ ఫేమస్ క్రికెటర్‌తో ఆ రోజుల్లోనే రఘురామ ఇంత క్లోజ్‌గా ఉన్నారంటే.. ఆయన రేంజ్ ఏంటో తెలుస్తుందని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఇక సచిన్ టెండూల్కర్‌కు తెలుగువారిలో చాలా మందితో మంచి ఫ్రెండ్‌షిప్ ఉండి. అందులో ప్రముఖంగా మెగాస్టార్ చిరంజీవి ఉంటారు. పుట్టినరోజు సందర్భంగా ఇరువురు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. మరి సచిన్‌తో రఘురామ కృష్ణంరాజు ఉన్న ఫొటోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sachin Tendulkar With MP Raghu Rama Krishnam Raju @sachin_rt @RaghuRaju_MP pic.twitter.com/GZk0rJ9JtZ
— Sayyad Nagpasha (@SayyadNagpasha) January 5, 2023