మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్.. ఈ పేరు చెబితే చాలు ఫ్యాన్స్ పులకరించిపోతారు. ఎన్నో వందల మ్యాచులు, వేలకొద్ది పరుగులు, ఇప్పటికీ ఆరాధించే అభిమానులు. ఇలా సచిన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. ఏదో ఒకలా ఫ్యాన్స్ కి దగ్గరగానే ఉంటున్నాడు. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే సచిన్.. రోడ్డుపై వెళ్తున్న వారికి హెల్మెట్ పెట్టుకోమని చెప్పడం లాంటివి చేస్తుంటాడు. క్రికెట్ కి సంబంధించిన టెక్నిక్స్ కూడా చెబుతుంటాడు. ఇప్పుడు అలాంటిదే ఒకటి చెబుతూ చిక్కుల్లో పడ్డాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సచిన్ ప్రస్తుతం రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో ఇండియా లెజెండ్స్ కి కెప్టెన్సీ చేస్తున్నాడు. ఇందులో భాగంగా బ్యాట్ గ్రిప్ ని శుభ్రం చేసుకోవడం ఎలానో చెబుతూ ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ‘ఇలాంటి చిన్న విషయాలు ఎవరు చెప్పరు’ అని క్యాప్షన్ కూడా జోడించాడు. అంతా బానే ఉంది కానీ ఓ విషయంలో మాత్రం సచిన్, ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ వీడియోలో భాగంగా బ్యాట్ క్లీన్ చేసే క్రమంలో సచిన్.. నీటి కుళాయిని అలానే వదిలేశాడు. దీంతో చాలావరకు నీరు వృథాగా పోయింది.
ఇక సచిన్ వీడియోపై అభిమానులు వరసపెట్టి కామెంట్స్ చేస్తున్నారు. ముంబయిలో ‘సేవ్ వాటర్’ క్యాంపెయిన్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన మీరే.. ఇలా చేస్తే ఎలా అని అభిమానులు, పలువురు నెటిజన్స్ అంటున్నారు. అవసరమైనప్పుడు టాప్ తిప్పితే సరిపోయేది కదా అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్య రోడ్ సేఫ్టీ సిరీస్ లో సౌతాఫ్రికా లెజెండ్స్ పై ఇండియా లెజెండ్స్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరి ఇలాంటి సమయంలో సచిన్ పై ఫ్యాన్స్ ఆగ్రహం గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి:కూల్‌గా ఉండే సచిన్‌కు ఆ రోజు కోపం వచ్చింది! గ్రౌండ్‌లో విధ్వంసమే జరిగింది!
Bats 🏏 & music 🎼 a combo for a lifetime!#CricketTwitter pic.twitter.com/mVP83WNB3M
— Sachin Tendulkar (@sachin_rt) September 13, 2022