India Legends vs South Africa Legends: రోడ్ సేఫ్టీపై విశ్వవ్యాప్తంగా అవగాహణ పెంచేందుకు ‘రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్’ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇండియా లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్ మధ్య ఇవాళ జరుగుతోన్న మ్యాచులో టీమిండియా క్రిక్ట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నిరాశపరిచాడు. తమ దేవుడు ఎప్పుడు మైదానంలోకి దిగుతాడా! అని ఎదురుచూసినా అభిమానులకు.. ఆ ఆనందాన్ని ఇచ్చినట్లే.. ఇచ్చి వారి ఆశలపై నీళ్లు చల్లాడు. 15 బంతుల్లో 16 పరుగులు చేశాక.. ఎంతిని బౌలింగ్ లో జోహాన్ బోథాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్ అందుకు తగ్గ ప్రదర్శనే చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. నామన్ ఓజా(21), సచిన్ టెండూల్కర్(16), యువరాజ్ సింగ్(8) నిరాశ పరిచినా.. సురేష్ రైనా(33, 4*4, 1*6), స్టువర్ట్ బిన్నీ(82, 5*4, 6*6), యూసఫ్ పఠాన్(35, 1*4, 4*6) రాణించడంతో సౌతాఫ్రికా లెజెండ్స్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. సౌతాఫ్రికా లెజెండ్స్ బౌలర్లలో వాండర్ వాత్ 2 వికెట్లతో రాణించగా, ఎంతిని, ఎడ్డీ లీ చెరో వికెట్ తీసుకున్నారు.
#FPCricket #RoadSafetyWorldSeries
🇮🇳 India Legends vs South Africa Legnds 🇿🇦
🏏 @sachin_rt c Botha b Ntini 16(15) (4s-2)#IndiaLegends #SachinTendulkarhttps://t.co/PAKZdjPTW5
— Firstpost Sports (@FirstpostSports) September 10, 2022
మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ టోర్నీ నేటి నుంచి అక్టోబర్ 1 వరకు కాన్పూర్, రాయ్ పూర్, ఇండోర్, డెహ్రడూన్ వేదికలుగా జరుగనుంది. ఈ సిరీస్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్ కు సచిన్ టెండూల్కర్ సారధ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచూలు.. కలర్స్ సినీప్లెక్స్, కలర్స్ సినీప్లెక్స్ హెచ్డీ, కలర్స్ సినీప్లెక్స్ సూపర్ హిట్స్, స్పోర్ట్స్ 18 ఖేల్ ఛానళ్లు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. వీటితో పాటు.. వూట్ యాప్, వెబ్ సైట్లలో కూడా మ్యాచులను ప్రత్యేక్షంగా చూడొచ్చు. ఈ సిరీస్ తొలి ఎడిషన్ లో ఇండియా లెజెండ్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.