టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అద్భుతమైన వికెట్ కీపర్. తన స్టన్నింగ్ వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో టీమిండియాకు, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. ధోని తర్వాత ఏ యువ వికెట్ కీపర్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన, మెరుపువేగంతో స్టంపింగ్ చేసినా ధోని గుర్తుకు వస్తాడు. అంతలా వేగవంతమైన కీపింగ్‌పై తన ముద్ర వేశాడు ధోని.
తాజాగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2022 ప్రారంభ మ్యాచ్‌లో ఒక మెరుపువేగంతో ఒక స్టంపింగ్ జరిగింది. చెన్నై స్టార్ బ్యాటర్ రాబిన్ ఊతప్పను వరణ్ చక్రవర్తి బౌలింగ్‌లో కేకేఆర్ యువ వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ మెరుపువేగంతో స్టంప్ అవుట్ చేశాడు. జాక్సన్ స్పీడ్‌కు క్రికెట్ లోకం షాక్ అయింది. అతన్ని ప్రశంసలతో ముంచెత్తింది. ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా జాక్సన్‌ను మెచ్చుకున్నాడు. జాన్సన్ చేసిన స్టెంపింగ్ ధోనిని గుర్తుకు తెచ్చిందని పేర్కొన్నాడు.
భారత్‌కు చెందిన యువ క్రికెటర్ జాక్సన్ సౌరాష్ట్ర తరపున దేశవాళీ క్రికెట్‌లో ఆడుతాడు. 2013లో ఆర్సీబీ జాక్సన్ కొనుగోలు చేసినా పెద్దగా అవకాశాలు రాలేదు. ఇప్పుడు బ్రావోను అవుట్ చేయడంతో జాక్సన్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తా 6 వికెట్ల తేడాతో చెన్నైను ఓడించిన విషయం తెలిసిందే. మరి జాక్సన్ స్టంపింగ్ గురించి సచిన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసిన ధోనీ!
Thank you so much @sachin_rt sir, it’s one of my biggest achievements to get such a compliment from you 🙏🏼 . Very Greatfull to you sir🙏 https://t.co/2O334y9dfQ
— Sheldon Jackson (@ShelJackson27) March 26, 2022
@ShelJackson27 stump was amazing!
He reminds me of @gilly381#IPL2022 pic.twitter.com/9g5vxKs11t— Mayank Pandey (@MayankP34936700) March 27, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.