సచిన్ టెండుల్కర్.. భారత క్రికెట్ కు చేసిన సేవలకు గాను ముంబై క్రికెట్ అసోసియేషన్ అరుదైన కానుకను ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈమేరకు ముంబై లోని వాంఖడే స్టేడియంలో సచిన్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది.
సచిన్ టెండుల్కర్.. క్రికెట్ గాడ్ గా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. టన్నుల కొద్ది పరుగులు, వందల కొద్ది రికార్డులు, రివార్డులతో ప్రపంచ క్రికెట్ ను దశాబ్దాల పాటు ఒంటి చేత్తో పాలించాడు. ఇటు భారత క్రికెట్ కు ఎనలేని సేవ చేసినందుకు గాను ముంబైలోని వాంఖడే స్టేడియంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని ముంబై క్రికెట్ అసోషియేషన్ తెలిపింది. ఇంతటి ఘనత సాధించిన సచిన్ టెండుల్కర్ కు మా తరుఫున ఇచ్చే ఓ చిరుకానుగా అసోసియేషన్ తెలిపింది.
సచిన్ టెండుల్కర్.. భారత క్రికెట్ కు చేసిన సేవలకు గాను ముంబై క్రికెట్ అసోసియేషన్ అరుదైన కానుకను ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈమేరకు ముంబై లోని వాంఖడే స్టేడియంలో సచిన్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ విగ్రహాన్ని సచిన్ 50వ పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 24 ముందు రోజు ఆవిష్కరించాలని ఎంసీఏ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే విగ్రహం ఏర్పాటు సంబంధించిన వివరాలను సచిన్ కు తెలిపి అంగీకారం తీసుకున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఇక వాంఖడే స్టేడియంలో పెడుతున్న తొలి విగ్రహం సచిన్ దే అని ఎంసీఏ ప్రెసిడెంట్ అమోల్ కాలే తెలిపారు.
ఇక విగ్రహం ఏర్పాటుపై సచిన్ కూడా స్పందించారు.”నా కెరీర్ ఈ గ్రౌండ్ లోనే స్టార్ట్ అయ్యింది. అదీకాక నా చిరకాల కోరిక అయిన వరల్డ్ కప్ గెలవడం కూడా 2011 లో ఇదే గ్రౌండ్ లో జరిగింది. నా జీవితానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన విశేషాలు అన్ని వాంఖడే స్టేడియంతోనే ముడిపడి ఉన్నాయి. గ్రౌండ్ లో క్లబ్ హౌస్ కు ఎదురుగా నా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు” అని సచిన్ చెప్పుకొచ్చాడు. మరి సచిన్ నిలువెత్తు విగ్రహాన్ని వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
MCA to Honour Sachin Tendulkar With Statue 🗽 at Wankhede Stadium Ahead Of 50th Birthday In April
On his Life Size Statue 🗽 Being Erected Inside Wankhede Stadium By MCA
🙏 Thank You MCA 🙏@sachin_rt || @100MasterBlastr pic.twitter.com/4SWrByPIuC
— TAPAS MAKUR (@SRT_for_ever) February 28, 2023
#WATCH | On his life-size statue being erected inside Wankhede stadium,Sachin Tendulkar says, “…My career started from this ground. My life’s biggest cricketing moment was in 2011 when we won World Cup, last game I played in 2013.All big moments, most of them, happened here…” pic.twitter.com/lRF90cXG9z
— ANI (@ANI) February 28, 2023