అంగన్‌వాడీకి వెళ్లే వయసులో అదిరిపోయే షాట్లు ఆడి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. డైపర్ వేసుకుని ప్లాస్టిక్ బ్యాట్‌తో అద్భుతమైన కవర్ డ్రైవ్, స్ట్రెయిట్ డ్రైవ్‌లు ఆడుతూ సెన్సేషన్‌గా మారిన డైపర్ కోహ్లీ బుడ్డోడు తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను కలిశాడు. తనను ఆదర్శంగా తీసుకొని క్రికెటర్‌గా ఎదగాలనుకుంటున్న ఐదేళ్ల షేక్ షాహిద్ గురించి తెలుసుకున్న భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సొంత ఖర్చులతో అతనికి ఐదు రోజుల స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించాడు. అతని కలను నిజం చేశాడు.
ముంబైలోని టెండూల్కర్ మిడిలెక్స్ గ్లోబల్ అకాడమీలో షాహిద్‌కు సచిన్ దగ్గరుండి మెళకువలు నేర్పించాడు. అతడికి కొన్ని టిప్స్ కూడా చెప్పి సంతకం చేసిన ఓ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ‘మేం అప్‌లోడ్ చేసిన వీడియో చూసిన సచిన్ సర్ మమ్మల్ని ముంబైకి ఆహ్వానించారు. ఐదు రోజుల పాటు అకాడమీలో షాహిద్‌కు క్రికెట్ ట్రైనింగ్ ఇప్పించారు. బ్యాక్ ఫుట్, ఫ్రంట్ ఫుట్‌లో ఎలాంటి షాట్స్ ఆడాలో చూపించారు. క్యాచ్‌లు ఎలా పట్టాలో నేర్పారు. షాహిద్‌లో ఎంతో ప్రతిభ ఉందని మెచ్చుకున్నారు. సచిన్ సర్ చేసిన దానికి కేవలం కృతజ్ఞతలు చెబితే సరిపోదు’అని షాహిద్ తండ్రి షేక్ షంషేర్ తెలిపాడు.షాహిద్ తండ్రి షేక్ షంషేర్ హెయిర్ సెలూన్‌లో వర్కర్‌గా పని చేస్తూ జీవినం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం తన కొడుకు బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. డైపర్ వేసుకున్న బుడ్డొడూ అచ్చం టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తరహాలో కవర్ డ్రైవ్స్ షాట్స్ ఆడాడు. దాంతో ఆ వీడియో క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా చానెల్ ఫాక్స్ స్పోర్ట్స్ ఈ డైపర్ బాలుడి బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సచిన్, వార్న్, మైకేల్ వాన్‌లను ట్యాగ్ చేసింది. దాంతో ఆ బుడ్డోడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. బ్రెట్ లీ, మైకేల్ వాన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు సైతం ఈ బుడ్డోడి ప్రతిభకు ఫిదా అయ్యారు. మరి ఇలాంటి లిటిల్ టాలెంట్‌ను ప్రొత్సహిస్తున్న మాస్టర్ బ్లాష్టర్ సచిన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Dream come true . Thanks🙏 @sachintendulkar sir. First time flight first time mumbai never imagine play in front of you At my 5 years of age . Lovely gesture from everyone there.not enough to say thank🙏 you. pic.twitter.com/r5t9Y196b7
— sk shahid (@shahidsk192016) March 10, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.