టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విషయంలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబూషేన్ కొంచెం మర్యాద తప్పాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా లబూషేన్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నువ్వు బచ్చా క్రికెటర్‌వి అతనో లెజెండరీ క్రికెట్.. కాస్త మర్యాదగా మాట్లాడు’ అంటూ క్రికెట్ అభిమానులు ఘాటుగా స్పందించారు.
వివరాల్లోకి వెళ్తే.. కామన్‌వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలను పునఃప్రారంభించడంపై సచిన్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అలాగే క్రికెట్‌ను కామన్‌వెల్త్‌లో ప్రవేశపెట్టడం ద్వారా కొత్త ఆడియన్స్ వస్తారని సచిన్ పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న టీమిండియా ఉమెన్స్ టీమ్‌కు సచిన్ ఆల్‌దిబెస్ట్ చెప్పారు. ఈ ట్వీట్‌పై స్పందించిన లబూషేన్.. ‘అగ్రిడ్ సచిన్.. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మంచి ప్రారంభ మ్యాచ్ కాబోతుంది’ అని రిట్వీట్ చేశారు.
కాగా.. సచిన్‌ను ఏకవచనంతో సంభోదించడం క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. తన కంటే ఎంతో సీనియర్ ప్లేయర్, అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక లెజెండరీ క్రికెటర్ అయిన సచిన్‌కు మర్యాద ఇవ్వడం నేర్చుకో అంటూ లబూషేన్‌కు గడ్డిపెట్టారు. ‘క్రికెట్‌లో డైపర్లు వేసుకునే బచ్చావైతే సచిన్ ఒక దిగ్గజం.. షో సమ్ రెస్పెక్ట్’ ‘సచిన్ కాదు.. సచిన్ సర్’ అంటూ నెటిజన్లు హితవుపలికారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Wonderful to see cricket back in the Commonwealth Games.
Hope this takes our beautiful game to newer audiences. Best wishes to @BCCIWomen’s team for their #CWG22 campaign.— Sachin Tendulkar (@sachin_rt) July 29, 2022