క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ టెండుల్కర్ తన కెరీర్ లోనే ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ టీమ్ ను ప్రకటించాడు. అయితే, ఈ జట్టులో భారత రెగులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి చోటు దక్కలేదు. అంతేకాకుండా టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనికి కూడా స్థానం కల్పించకుండా అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఇద్దరితో పాటు చాలా మంది దిగ్గజ క్రికెటర్లను విస్మరించిన సచిన్ తన జట్టులో తనకే చోటు కల్పించుకోకపోవడం మరో విశేషం.
ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్‌లను ఎంచుకున్న సచిన్, వన్‌డౌన్‌లో బ్రియాన్ లారాని ఎంచుకున్నాడు. సెకండ్ డౌన్‌లో వివ్ రిచర్డ్స్ కి స్థానం కల్పించిన సచిన్, ఆ తరువాత వరుసగా దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్ కలిస్, సౌరవ్ గంగూలీ, వికెట్‌కీపర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్, స్పిన్నర్ల కోటాలో హర్భజన్ సింగ్, షేన్ వార్న్, పేసర్లుగా వసీం అక్రమ్, గ్లెన్ మెక్‌గ్రాత్‌లను ఎంచుకున్నాడు. సచిన్ తన డ్రీమ్ జట్టులో ద్రవిడ్, లక్ష్మణ్ , బ్రెట్ లీ, పాంటింగ్, మురళీధరన్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాలకు కూడా చోటు కల్పించలేదు.
సచిన్ తన ప్లేయింగ్ ఎలెవెన్‌లో తమ అభిమాన క్రికెటర్ ని ప్రకటించకపోవడంతో కోహ్లి అభిమానులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందులోను గంగూలీని తీసుకొని కోహ్లీని విస్మరించడంతో మరింత గుర్రుగా ఉన్నారు కోహ్లీ అభిమానులు. ఏ విధంగా చూసుకున్న పరుగుల విషయంలోనైనా,రికార్డుల పరంగానైనా గంగూలీ కంటే తమ అభిమాన క్రికెటర్ బెటరే కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు కోహ్లీ ని కెప్టెన్సీ నుండి తొలగింపు విషయంపై గంగూలీ, కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయం మరోసారి బయటపడింది. ఈ విషయంపై ఇప్పటికే పలువురు మాజీ ఆటగాళ్లు స్పందించినప్పటికి, సచిన్ ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. మరి ఈ కామెంట్స్ పై సచిన్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి. ఈ విషయంపై మీరు కూడా మీ అభిఫ్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
సచిన్ ఆల్ టైం బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ : వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, వివ్ రిచర్డ్స్, సౌరవ్ గంగూలీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, వసీం అక్రమ్, హర్భజన్ సింగ్, గ్లెన్ మెక్‌గ్రాత్