టీమిండియా తరఫున సచిన్ టెండూల్కర్ ఆడిన బెస్ట్ ఇన్నింగ్స్ ఏది అంటే ఠక్కున చెప్పలేం. ఎందుకంటే ఆయన భారత జట్టు తరఫున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ భారత్ తరఫున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే వాటిల్లో ఒకదాని గురించి మాత్రం అందరూ గొప్పగా చెప్పుకుంటారు. అదే ఆస్ట్రేలియాలోపై షార్జాలో ఆడిన ఇన్నింగ్స్. 1998 ఏప్రిల్ 2న టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు ఎడారి దేశమైన యూఏఈలోని షార్జా సిటీలో తలపడ్డాయి. ఆ మ్యాచ్ సమయంలో ఇసుక తుఫాన్ వచ్చింది. దీంతో కొద్దిసేపు మ్యాచ్‌ను ఆపేశారు. కానీ ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ సృష్టించిన పరుగుల తుఫాన్లో ఆసీస్ బౌలర్లు చిక్కుకుని విలవిల్లాడారు. కోలా కోలా కప్ ట్రయాంగిల్ సిరీస్‌లో ఫైనల్ చేరాలంటే భారత్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 284 రన్స్ చేసింది. ఫైనల్‌కు చేరుకోవాలంటే భారత్ కనీసం 254 రన్స్ చేయాలి.
ఫ్లాట్ పిచ్‌లు, మెరుగైన బ్యాట్లు ఉన్న ఈ రోజుల్లో హిట్టింగ్ చేయడం పెద్ద విషయం కాదు. టీ20 క్రికెట్ వల్ల అందరూ ఈ తరహా ఆటకు అలవాటు పడ్డారు. కానీ అప్పట్లో 285 రన్స్ ఛేజ్ చేయడం పెద్ద విషయం అనే చెప్పాలి. ఇసుక తుఫాన్ కారణంగా ఈ మ్యాచ్‌ను కుదించారు. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టీమిండియా ఫైనల్‌కు చేరాలంటే 237 రన్స్ చేయాలి. ఎదురుగా ఉన్నది అసాధారణ బౌలర్లైన షేన్ వార్న్, మైకేల్ కాస్ప్రోవిచ్, డామిన్ ఫ్లెమింగ్, టామ్ మూడీ. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సచిన్ గ్రౌండ్ నలుమూలలా షాట్స్ కొడుతూ కంగారూలను కంగారెత్తించాడు. ఆసీస్ బౌలర్లతో ఆటాడుకున్న సచిన్.. 143 రన్స్ చేశాడు. దీంతో టీమిండియా 237 మార్క్‌ను దాటేసి ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
షార్జా మ్యాచ్‌లో 20 బాల్స్‌లో 38 రన్స్ అవసరమైన దశలో వేగంగా ఆడే ప్రయత్నంలో సచిన్ ఔటయ్యాడు. ఆయన క్రీజులో ఉంటే భారత్ మ్యాచ్ గెలిచేది. టెండూల్కర్ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ను వన్డే క్రికెట్ హిస్టరీలో అత్యుత్తమైన వాటిల్లో ఒకటిదిగా పరిగణిస్తారు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌కు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముంబైలో ఫ్యాన్స్ సమక్షంలో సచిన్ కేక్ కట్ చేశాడు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘మీ మద్దతు, ప్రేమ, అభిమానం లేకపోతే నేను ఇది సాధించేవాడ్ని కాదు. టీమిండియా తరఫున నేను ఏదైనా చేయగలడానికి ఆ బలమే కారణం. ఇండియా తరఫున ఆడాలి, ప్రపంచ కప్‌ను పైకి ఎత్తాలనేది నా కల. 1983లో పుట్టిందీ కల. 2011 వరకు నా లైఫ్‌లో ఇదే కోరిక ఉండేది’ అని సచిన్ ఎమోషనల్ అయ్యాడు.
#WATCH | Mumbai: Sachin Tendulkar cuts a cake ahead of his 50th birthday, at an event on the 25 years of his historic ‘Desert Storm’ innings in Sharjah against Australia.
He will celebrate his 50th birthday on 24th April. pic.twitter.com/gh6BJ1qxXd
— ANI (@ANI) April 22, 2023