అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 168 పరుగుల భారీ తేడాతో గెలిచి.. ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. తన టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ బాదిన గిల్.. దాంతోనే టీమిండియా తరఫున టీ20ల్లో హైఎస్ట్ స్కోర్ చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. గతంలో 122 పరుగులతో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. 52 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్న గిల్.. మొత్తంగా 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో 126 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచాడు. గిల్ చెలరేగడంతో టీమిండియా 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరంభంలో కాస్త టైమ్ తీసుకుని ఆడిన గిల్.. తన స్కోర్ 60ల్లోకి వచ్చిన తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. సిక్సులు, ఫోర్లతోనే మాట్లాడాడు. 69 నుంచి 100 పరుగుల వద్దకు మెరుపువేగంతో వచ్చేశాడు. ఈ సిరీస్ కంటే ముందు న్యూజిలాండ్‌పైనే వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన గిల్.. ఇప్పుడు టీ20ల్లోనూ సెంచరీ చేసి.. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఇలా బుధవారం న్యూజలాండ్‌తో జరిగిన సిరీస్ డిసైడింగ్ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన గిల్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే.. ఈ మ్యాచ్ చూసి.. ఆ తర్వాత ఇటివల అండర్ 19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఉమెన్స్ టీమ్‌ను సన్మానించేందుకు సచిన్ టెండూల్కర్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి వచ్చాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అండర్ 19 ఉమెన్స్ టీమ్‌కు నగదు పురస్కారం అందించి.. వారి విజయం గురించి మాట్లాడి వెళ్లిపోయాడు. అయితే.. భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌కు సచిన్ వస్తుండటంతో మ్యాచ్ అనంతరం ఆటగాళ్లకు ట్రోఫీ, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సచిన్ చేతుల మీదుగానే అందిస్తారని అంతా భావించారు. కానీ.. అలా జరగలేదు. అందుకు కారణం.. శుబ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శన కనబర్చి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు అర్హత సాధించడమే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
సచిన్ టెండూల్కర్ కంటే దిగ్గజ క్రికెటర్ టీమిండియాలో లేడు. అలాంటి వ్యక్తి స్టేడియంలో ఉన్నప్పుడు అతని చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం కంటే గొప్ప విషయం ఏముంటుంది. ఈ విషయం టీమిండియా ప్రస్తుతం క్రికెటర్లతో పాటు బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులకు సైతం తెలుసు. కానీ.. సచిన్ కూతురు సారా టెండూల్కర్, శుబ్‌మన్ గిల్ మధ్య ప్రేమ వ్యవహరం ఉందనే విషయంపై సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. ఆ విషయంపై సారా కానీ, గిల్ కానీ ఎప్పుడు స్పందించకపోయినా.. వారి మధ్య ఏదో ఉందని, గిల్-సార డేటింగ్‌లో ఉన్నారని గతంలో అనేక వార్తలు, కథనాలు వచ్చాయి. ఈ విషయంలోనే సచిన్.. గిల్‌పై కోపంగా ఉన్నాడని, అందుకే నిన్నటి మ్యాచ్‌లో గిల్ అద్భుత ప్రదర్శన కనబర్చినా.. అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు రాలేదని, అసలు ఆ ప్రజెంటేషన్ సెర్మనీలోనే సచిన్ పాల్గొనలేదని సోసల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝐂𝐎𝐍𝐆𝐑𝐀𝐓𝐔𝐋𝐀𝐓𝐈𝐎𝐍𝐒 𝐭𝐨 𝐨𝐮𝐫 𝐖𝐎𝐑𝐋𝐃 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒!
Bharat Ratna Shri @sachin_rt and Office Bearers of BCCI honour the achievements of the World Cup-winning India U19 team and present them with a cheque of INR 5 crore. 🇮🇳 #TeamIndia @JayShah pic.twitter.com/u13tWMPhLQ
— BCCI (@BCCI) February 1, 2023