క్రికెట్ చరిత్రలో కొన్ని కొన్ని దేశాల మధ్య మ్యాచ్ అంటే.. ప్రపంచం మెుత్తం ఆ దేశాలవైపే చూస్తుంది. అలాంటి మ్యాచ్ ల్లో ఇండియా-పాక్ మెుదటి స్థానంలో ఉండగా.. తర్వాత ఇంగ్లాండ్-ఆసిస్ ల యాషెస్ సిరీస్ మ్యాచ్ లు ఉంటాయి. ఇక తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ ఉన్న సిరీస్ ఏదైనా ఉంది అంటే అది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీనే. రెండున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ట్రోఫీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. మరి అంతటి ఫాలోయింగ్ ఉన్న ఈ సిరీస్ లో రికార్డుల రారాజుగా ఇప్పటికీ కొనసాగుతున్నాడు టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్. మరి ఈ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సచిన్ క్రియేట్ చేసిన చెక్కుచెదరని 9 రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సచిన్ టెండుల్కర్.. వర్ణించడానికి మాటలే లేని క్రికెట్ దేవుడు. టన్నుల కొద్ది పరుగులు, వందల కొద్ది అవార్డులు, ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డులు. సచిన్ పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేవి. ఇక సచిన్ ఆడిన అన్ని సిరీస్ లు ఒకెత్తు అయితే ఆసిస్ తో ఆడిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఒకెత్తు అని చెప్పాలి..1996 లో ఆస్ట్రేలియాతో ప్రారంభం అయిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రికార్డుల రారాజుగా వెలుగొందుతున్నాడు సచిన్ టెండుల్కర్. ఇప్పటికీ సచిన్ నెలకొల్పిన 9 రికార్డులు అలాగే ఉండటం విశేషం. ఆ రికార్డుల వివరాల్లోకి వెళితే.. ఈ ట్రోఫీలో 65 ఇన్నింగ్స్ లు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ 3262 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఇప్పటికీ ఈ రికార్డును ఎవరు బీట్ చెయ్యలేదు.
వీటితో పాటుగా ఈ ట్రోఫీలో అత్యధికంగా 9 సెంచరీలు, 16 అర్దశతకాలు సాధించిన క్రికెటర్ గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. 391 ఫోర్లు, 25 సిక్సర్లు బాదీ ఈ రికార్డులు కూడా తనపేరిటే సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు లిటిల్ మాస్టర్. ఇక అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ (5)లు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ (3) లు సాధించిన ఏకైక బ్యాటర్ గా సచిన్ కొనసాగుతున్నాడు. అలాగే ఎక్కువ 150కి పైగా పరుగులు చేసిన (6సార్లు), అత్యధిక 100+ భాగస్వామ్యాలను(20 సార్లు) నెలకొల్పిన రికార్డులు సైతం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిటే ఉన్నాయి. ఈ 9 రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇక ఈ రికార్డులను బ్రేక్ చేసే ప్లేయర్స్ ప్రస్తుతానికైతే సచిన్ వెనకాల ఎవరూ లేరు. దాంతో మరికొన్ని రోజులు సచిన్ రికార్డులు పదిలంగా ఉండటం ఖాయం అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సచిన్ నెలకొల్పిన రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sachin Tendulkar ruled the Border Gavaskar trophy 😇#CricketTwitter #indvsaus pic.twitter.com/OU3g7uzep0
— Sportskeeda (@Sportskeeda) February 6, 2023