భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్రసింగ్ ధోని ముందు వరుసలో ఉంటాడు. భారత్‌కు రెండు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ధోనినే. అలాగే ప్రపంచ క్రికెట్‌లో మూడు ఐసీసీ రకాల ఐసీసీ ట్రోఫీలు(టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచిన ఏకైక కెప్టెన్ ధోని. ప్రపంచంలో మరే దిగ్గజ కెప్టెన్‌కి కూడా ఇలాంటి అరుదైన రికార్డు లేదు. కేవలం కప్పులే కాదు. జట్టు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ప్రశాంతంగా ఉంటూ.. అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రత్యర్థిని దెబ్బతీయడంలో ధోనిని మించిన కెప్టెన్ లేడనడంలో అతిశయోక్తిలేదు. అందుకే ధోనిని మిస్టర్ కెప్టెన్ కూల్‌గా పిలుస్తుంటారు. అతి చిన్న వయసులో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న ధోని.. జట్టును చాలా ఏళ్లపాటు విజయవంతంగా నడిపించాడు.
జట్టులో తనకంటే సీనియర్ ప్లేయర్లు ఉన్నా.. 2007లో ధోనికి భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. వారి అంచనాలను దాటి.. సౌతాఫ్రికా వేదికగా జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ 2007లో భారత జట్టును ముందుండి నడిపించి.. విశ్వవిజేతగా నిలిపాడు. ఆ తర్వాత మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా కెప్టెన్‌గా మారిన ధోని.. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. 2011లో భారత్‌కు రెండో వరల్డ్ కప్ అందించి.. వన్డే ఛాంపియన్‌గా నిలిపాడు. అలాగే 2013లో ధోని కెప్టెన్సీలోనూ టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. ఇలా మూడు వేర్వేరు ఐసీసీ మెగా ఈవెంట్స్‌లో ధోని భారత్‌ను విజేతగా నిలిపాడు. అయితే ధోని కెప్టెన్‌గా అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. కానీ.. సెహ్వాగ్, యువరాజ్‌సింగ్, హర్భజన్ సింగ్‌లను కాదని జూనియర్ అయిన ధోనికి కెప్టెన్సీ రావడం వెనుక టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ హస్తం ఉన్నందన్న విషయం అందరికి తెలిసిందే.
అయితే.. టీమిండియా కెప్టెన్‌గా ధోనినే కరెక్ట్ అని సచిన్‌కు ఎందుకు అనిపించిందో.. అసలు ధోని పేరును కెప్టెన్సీకి సచిన్ ఎందుకు ప్రతిపాదించాడో ఎవరో తెలియదు. ఆ విషయం ధోనికి కూడా తెలియదు. కానీ.. సచిన్ రికమండేషన్‌పై ధోని కెప్టెన్ అయ్యాడు. టీమిండియా ఛాంపియన్‌గా నిలిపాడు.. కొన్ని ఏళ్ల పాటు ఇండియన్ క్రికెట్‌ను సైతం ఏలి.. రిటైర్మంట్ కూడా ప్రకటించాడు. ఇదంత జరిగిన తర్వాత.. ఇన్నేళ్లకు అసలు కెప్టెన్సీకి ధోని పేరును ఎందుకు సూచించాల్సి వచ్చిదనే విషయాన్ని బయటపెట్టాడు సచిన్ టెండూల్కర్.
ఆ విషయాన్ని సచిన్ మాటల్లో,,‘మేము ఇంగ్లండ్‌లో ఉన్న టైమ్‌లో నాకు కెప్టెన్సీ ఆఫర్ వచ్చింది. అప్పుడు నేను మన టీమ్‌లోనే మంచి లీడర్ ఉన్నాడని వారికి చెప్పాను. కానీ.. అతను ఇంకా జూనియర్‌గా ఉన్నాడు. అయినా కూడా అతన్ని పరిశీలనలోకి తీసుకోవచ్చని చెప్పాను. ఇక ధోనితో ఫీల్డ్‌లో చాలా సంభాషణ జరిగింది. రాహుల్ ద్రవిడ్ టీమిండియా కెప్టెన్‌గా ఉన్న సమయంలో కెప్టెన్నీ గురించి ఏమనుకుంటున్నావ్? అని ధోనిని అడిగినప్పుడు.. అతని నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఎంతో సమతుల్యంగా, ప్రశాంతంగా, పరిణతి చెందినదిగా ఉంది. మంచి కెప్టెన్సీ అంటే ప్రత్యర్థి కంటే ఒక అడుగు ముందుండడమే. అది తక్షణమే జరగదు.. మీరు 10 బంతుల్లో 10 వికెట్లు తీయలేరు, దానిని ప్లాన్ చేసుకోవాలి. చివరికి స్కోర్ బోర్డే మాట్లాడుతుంది. ఇలాంటి లక్షణాలను అతనిలో చూశాను. అందుకే ధోని పేరు సిఫార్సు చేశాను.’ అని సచిన్ పేర్కొన్నారు. అందరి కంటే ముందుగా సచిన్ గుర్తించిన ఆ లీడరే.. టీమిండియాకు రెండు వరల్డ్ కప్‌లు అందించాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sachin Tendulkar reveals why he recommended MS Dhoni’s name for the captaincy.@sachin_rt | @msdhoni | #CricketTwitter pic.twitter.com/CeGKfYn0yG
— CricTracker (@Cricketracker) December 22, 2022