2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సచిన్ అవుటై వెళ్లేటప్పుడు విరాట్ కోహ్లీకి ఓ సీక్రెట్ చెప్పాడు. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు రివీల్ చేశాడు మాస్టర్ బ్లాస్టర్. ఇంతకీ ఆ రహస్యం ఏంటంటే?
2011 వరల్డ్ కప్.. 28 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా వన్డే ప్రపంచ కప్ ను ముద్దాడింది. ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటన గురించి ఇప్పటికీ అభిమానుల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆత్రుత ఉంది. ఇంతకీ ఆ సంఘటన ఏంటి అంటే? ఈ మ్యాచ్ లో సచిన్ టెండుల్కర్ అవుటై పెవిలియన్ కు వెళ్తున్న క్రమంలో.. బ్యాటింగ్ కు వస్తున్న విరాట్ కోహ్లీకి సచిన్ ఏదో సీక్రెట్ చెప్పాడు. ఆ ఫొటో ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన సచిన్ టెండుల్కర్ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. తాను ఆ రోజు విరాట్ కు చెప్పిన సీక్రెట్ ను 12 సంవత్సరాల తర్వాత రివీల్ చేశాడు. ఆ రోజు సచిన్, విరాట్ కు ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.
టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ తాజాగా అభిమానులతో ముచ్చటించాడు. #Ask Sachin అంటూ ట్విటర్ వేదికగా అభిమానుతో చిట్ చాట్ చేశాడు. ఈ చాట్ లో ఎన్నో సంవత్సరాలుగా వెలుగులోకి రాని సీక్రెట్ ను వెల్లడించాడు మాస్టర్ బ్లాస్టర్. కొన్ని సంవత్సరాలుగా క్రికెట్ లవర్స్ మైండ్స్ లో నాటుకుపోయిన ఆ ఫొటోకు సంబంధించిన రహస్యాన్ని ఫ్యాన్స్ కు తెలియజేయశాడు సచిన్. ఇక కొందరు అభిమానులు ఫొటోలు షేర్ చేసి ప్రశ్నలు అడిగారు. వాటన్నింటికి ఎంతో ఓపికగా సమాధానాలు ఇస్తూ వచ్చాడు క్రికెట్ గాడ్. అయితే ఓ అభిమాని ‘2011 వరల్డ్ కప్ ఫైనల్లో మీరు అవుటై వెళ్తు.. విరాట్ కోహ్లీకి ఏదో సీక్రెట్ చెప్పారు, ఆ సీక్రెట్ ఏంటి? అంటూ ఫొటోను జత చేశాడు.
ఇక ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానం ఎక్కడా చెప్పలేదు మాస్టర్ బ్లాస్టర్. 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో 31 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. మలింగ డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ తో పాటుగా సచిన్ ను అవుట్ చేశాడు. ఇక సచిన్ అవుటై పెవిలియన్ కు వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న విరాట్ ఏదో చెప్పాడు. అసలు విరాట్ కు సచిన్ ఏం చెప్పాడు అన్నది 12 సంవత్సరాల నుంచి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. తాజాగా చిట్ చాట్ లో ఓ ఫ్యాన్ అడిగిన ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చాడు సచిన్. ఇంతకీ సచిన్ ఆ రోజు ఏం చెప్పాడు అంటే.. “బాల్ ఇంకా కాస్త స్వింగ్ అవుతోంది. చూసుకుని ఆడు” అని చెప్పాడట మాస్టర్ బ్లాస్టర్.
ఈ క్రమంలో సచిన్ చెప్పిన సీక్రెట్ తో జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ, గంభీర్ తో కలిసి టీమిండియాను ఆదుకున్నాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 49 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇక మరికొన్ని ప్రశ్నలకు ఓపికగా సమాధాంన ఇచ్చాడు సచిన్. ధోనిని ఎంఎస్ అని పిలుస్తానని.. తనకు అప్పర్ కట్, స్ట్రైట్ డ్రైవ్ షాట్స్ అంటే ఇష్టమని తెలిపాడు. తనకు ఇష్టమైన గ్రౌండ్ వాంఖడే అని తర్వాత చెపాక్ అంటూ చెప్పుకొచ్చాడు. సచిన్ కు బిర్యానీ అంటే ఇష్టం, నచ్చిన ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ అంటూ తన ఇష్టా ఇష్టాలను అభిమానులతో పంచుకున్నాడు. మరి ఇన్ని సంవత్సరాలుగా చెప్పని సీక్రెట్ ను ఇప్పడు బయటపెట్టాడు మాస్టర్ బ్లాస్టర్.