మహిళల ఆసియా కప్ 2022లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. పురుషుల జట్టు ఇటివల ముగిసిన ఆసియా కప్‌లో విఫలమైనా.. మహిళా జట్టు అదరగొడుతోంది. సోమవారం షెల్లాట్ వేదికగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్ స్మృతీ మంధానకు రెస్ట్ ఇవ్వడంతో ఆంధ్రా అమ్మాయి సబ్బినేని మేఘన ఓపెనర్‌గా దిగింది. వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్న మేఘన.. హాఫ్ సెంచరీతో సత్తా చాటింది.
స్టార్ ప్లేయర్ షఫాలీ వర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన మేఘన అద్భుతమైన కవర్ డ్రైవ్‌లతో అలరించింది. మలేషియా బౌలర్లపై విరుచుకుపడుతూ.. 53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక భారీ సిక్స్‌తో 69 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు 116 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత.. ఇన్నింగ్స్ 14వ ఓవర్ ఐదో బంతికి క్యాచ్ అవుట్‌గా మేఘన వెనుదిరిగింది. షఫాలీ వర్మ 39 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సులతో 46 పరుగులు చేసి రాణించింది. అలాగే రిచా ఘోష్ కూడా 33 పరుగులతో ఆకట్టుకుంది.
భారీ లక్ష్యఛేదనకు దిగిన మలేషియా 5.2 ఓవర్లలో 16 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 30 పరుగుల తేడాతో భారత్ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక హాఫ్ సెంచరీతో రాణించిన మేఘనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ ప్రదర్శనపై మేఘన మాట్లాడుతూ.. దేశానికి ప్రాతినిధ్యం వహించడం, టీమ్ కోసం స్కోర్ చేయడం ఎప్పుడూ ప్రత్యేకమే అని చెప్పింది. అలాగే తాను వికెట్ గురించి పెద్దగా ఆలోచించలేదని, బాగా ఆడాలని మాత్రమే అనుకున్నట్లు పేర్కొంది. షఫాలీతో పార్ట్‌నర్ షిప్ తనకెంతో సహాయపడినట్లు తెలిపింది.
She is the Future of India
Sabbhineni Meghanapic.twitter.com/kZiXFxVGrL
— Cric (@Ld30972553) October 3, 2022
ఇది కూడా చదవండి: వరల్డ్ కప్‌లో వీళ్లదే హవా! కోహ్లీ, రోహిత్, సూర్యను పట్టించుకోని గిల్‌క్రిస్ట్