ప్రస్తుతం క్రికెట్ లో బలమైన జట్టు ఏది అంటే.. టీమిండియా. అలాంటి జట్టు ఓటమితో తలవంచిన చోట(సౌతాఫ్రికా గడ్డపై).. బంగ్లాదేశ్ జట్టు వన్డే సిరీస్ గెలిచి కొత్త చరిత్రకు నాంది పలికింది . జనవరిలో సౌతాఫ్రికా గడ్డపై జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక ఘోర పరాజయం పాలైతే పసికూన బంగ్లాదేశ్ మాత్రం సఫారీలకు సొంత గడ్డపైనే చుక్కలు చూపించి వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. సిరీస్ అసాంతం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బంగ్లా పులులు సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలకమైన మూడో వన్డే మ్యాచ్‌లోనూ చెలరేగారు. ఆ జట్టు బౌలర్ తస్కిన్ అహ్మద్ విశ్వరూపానికి తోడు ఓపెనర్ల విజృంభణ కలిసి సౌతాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్‌కు తొలి వన్డే సిరీస్ లభించింది.
సెంచూరియన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా జట్టు.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి 37 ఓవర్లలో 154 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ పేస్ బౌలర్ తస్కిన్ అహ్మద్ 5 వికెట్లతో చెలరేగి సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. బంగ్లా బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాటర్లలో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ప్రొటీస్ బ్యాటర్లలో జానెమన్ మలాన్ చేసిన 39 పరుగులే టాప్ స్కోరర్ అంటే.. బౌలింగ్ ఏ రీతిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 5 వికెట్లతో చెలరేగగా, షకీబ్ 2 వికెట్లతో రాణించాడు.
ఇది కూడా చదవండి: పాకిస్థాన్‌ను కుప్పకూల్చిన ఆసీస్! కేవలం 20 పరుగులకే..అనంతరం 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ జట్టు సునాయసంగా చేధించింది. ఆ జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ 87 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. తొలి వికెట్‌కు 127 పరుగుల సెంచరీ భాగస్వామ్మాన్ని నెలకొల్పాక.. 48 పరుగులు చేసిన లిటన్ దాస్ ఔటైనప్పటికీ షకీబుల్ హాసన్ (18*)తో కలిసి తమీమ్ ఇక్బాల్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. కేవలం 26.3 ఓవర్లలోనే బంగ్లాదేశ్ లక్ష్యాన్ని చేధించింది. దీంతో బంగ్లాదేశ్ మ్యాచ్‌తోపాటు వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. కాగా తొలి వన్డేలో బంగ్లాదేశ్ 38 పరుగుల తేడాతో గెలవగా.. రెండో వన్డేలో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 3 వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు పేసర్ తస్కిన్ అహ్మద్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా లభించింది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
A day to remember!
Bangladesh with their first-ever ODI series win in South Africa with a dominating 9-wicket victory in the final match!
PHOTO CREDIT: Cricket South Africa #BCB #Cricket #SAvBAN pic.twitter.com/9IyKR2Yr1k
— Bangladesh Cricket (@BCBtigers) March 23, 2022
An outpouring of emotions after a memorable series win for Bangladesh 🥲🥳
🎥: @SuperSportTV #SAvBAN pic.twitter.com/zVp7CuF8pP
— CricWick (@CricWick) March 23, 2022
Bangladesh fans enjoying themselves here in Centurion.#SAvBAN pic.twitter.com/VI8zwblRzw
— Tiisetso Malepa (@TiisetsoMalepa) March 23, 2022