వయస్సు పైబడితేనో.. సరిగా రాణించలేనప్పుడో ఆటగాళ్లు కెరీర్ కు ముగింపు పలకడం సహజం. లేదంటే బాగా రాణించాక కెరీర్ ఉన్నత దశలో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తారు. కానీ, ఈ క్రికెటర్ తీసుకున్న నిర్ణయం ఇందులో ఏ కోవకు చెందింది కాదు. అవకాశాలు రాక.. వేచి చూసి సమయాన్ని వృధా చేసుకోలేక కఠిన నిర్ణయం తీసుకున్నాడు.
సాధారణంగా వయస్సు పైబడితేనో.. రాణించలేనప్పుడో ఆటగాళ్లు కెరీర్ కు ముగింపు పలకడం సహజం. లేదంటే బాగా రాణించాక కెరీర్ ఉన్నత దశలో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తారు. కానీ, సౌతాఫ్రికా క్రికెటర్ తీసుకున్న నిర్ణయం ఇందులో ఏ కోవకు చెందింది కాదు. మరో పదేళ్ల పాటు దేశానికి సేవలందించే అవకాశం ఉన్నా.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎవరా క్రికెటర్..? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు..? అన్నది ఇప్పుడు చూద్దాం..
ఈ మధ్యకాలంలో సౌతాఫ్రికా జట్టు పెద్దగా రాణించింది లేదు. చెప్పుకోవడానికి డికాక్, వాండర్ డస్సెన్, నొర్జే, రబడ, షంషీ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నా.. అన్నింటా ఓటములే. టీ20 వరల్డ్ కప్ లో నెథర్లాండ్స్ చేతిలో ఘోర ఓటమి చవిచూసి సెమిస్ అవకాశాలను పోగొట్టుకున్న సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆపై ఇండియా సిరీస్ లో నైనా రాణిస్తారనుకుంటే ఇక్కడే అదే ఆట తీరు. టీ20 సిరీస్ ను 2-0తో కోల్పోతే వన్డే సిరీస్ ను 3-0తేడాతో కోల్పోయింది. అనంతరం ఆస్ట్రేలియాలో పర్యటనలోనూ వారి ఆట మారలేదు. 4 మ్యాచుల టెస్ట్ సిరీస్ ను 2-0తో కోల్పోయింది. పైగా ఇన్నింగ్స్ తేడాతో ఓటమి చవిచూడటం గమనార్హం.
ప్రొటీస్ జట్టుకు విజయాలు అందించే ఆటగాళ్లు లేరా! అని కాదు.. ఉన్నా అవకాశాలు రావడం లేదు. ఈ కారణంతోనేఆటగాళ్లు ఒక్కొక్కరిగా ఆటకు గుడ్ బై చెప్తున్నారు. వేచి చూసి సమయం వృధా చేసుకోవడం కంటే.. రిటైర్మెంట్ ప్రకటించి అంతర్జాతీయ లీగ్ లలో ఆడుకోవచ్ఛన్నది వారి ఆలోచన. ఈ మధ్యకాలంలో ఫర్హాన్ బెహార్డియాన్, డ్వేన్ ప్రిటోరియస్ ఇవే కారణాలతో అంతర్జాతీయ కెరీర్ కు ముగింపు పలికారు. తాజాగా, వారు ఎంచుకున్న దారిలోనే మరో క్రికెటర్ అడుగులు వేశాడు. సౌతాఫ్రికా క్రికెటర్ థియునిస్ డి బ్రూన్ 30 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆరేళ్ల కెరీర్‌లో కేవలం 13 టెస్ట్‌లు, 2 టీ20లు మాత్రమే ఆడిన డి బ్రూన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు.
Theunis de Bruyn, who played 13 Tests and two T20Is for South Africa, declares the end of international cricket.
.
.#cricket #testcricket #Thenisdebruyn #southafrica #tests #T20Is #Retirement #cricketmoodofficial pic.twitter.com/OyoKppge5t— Cricket Mood (@Cricketmood) February 16, 2023
2017లో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేసిన డి బ్రూన్, గతేడాది చివరలో ఆస్ట్రేలియాపై తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత సరైన అవకాశాలు రాక జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. టెస్ట్‌ల్లో 19.5 సగటున 468 పరుగులు చేసిన డి బ్రూన్ .. 2018లో శ్రీలంకపై తొలి సెంచరీ చేశాడు. ఇక ఆడిన రెండు టీ20 మ్యాచుల్లో 26 పరుగులు చేశాడు. డి బ్రూన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని అతని దేశవాలీ టీమ్ టైటాన్స్ వెల్లడించింది. “జాతీయ జట్టుకు ప్రాతనిధ్యం వహించడాన్ని డి బ్రూన్ గౌరవంగా ఫీలవుతున్నాడని టైటాన్స్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది..” కాగా, డి బ్రూన్ ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్ తొలి ఎడిషన్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ టోర్నీలో క్యాపిటల్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ టోర్నీలో 238 పరుగులు చేసిన డి బ్రూన్.. సెకెండ్ హైయెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచారు.
NEWS: “Theunis de Bruyn Retires From International Cricket”.
Read more: https://t.co/qog04snzzn#WhereLegendsRise
— Momentum Multiply Titans (@Titans_Cricket) February 16, 2023