ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో తొలి సారి ఓడించి జింబాబ్వే చరిత్ర సృష్టించింది. మూడు వన్డేల సిరీస్ కోసం ఆసీస్ వెళ్లిన జింబాబ్వే తొలి రెండు వన్డేల్లో ఓడి.. మూడో వన్డేలో మాత్రం సత్తా ఆసీస్‌కు షాకిచ్చింది. హేమాహేమీలున్న ఆస్ట్రేలియాను 141 పరుగులకే కుప్పకూల్చి అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే స్పిన్నర్ ర్యాన్ బర్ల్ అదరగొట్టాడు. డేవిడ్ వార్నర్, మ్యాక్స్‌వెల్ లాంటి స్టార్లను అవుట్ చేయడమే కాకుండా మొత్తం ఐదు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. మూడే మూడు ఓవర్లు మాత్రమే వేసి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి అయిదు వికెట్లను పడగొట్టాడు. అతని బౌలింగ్‌లో ఆసీస్ బ్యాటర్లు ఒక్కటంటే ఒక్క ఫోర్, సిక్స్ కూడా కొట్టలేకపోయారు.
ఇంతటి అద్భుతమైన బౌలింగ్ వేసిన క్రికెటర్ సరైన షూ లేక ఇబ్బంది పడుతున్నాడు. చిరిగిన షూకి గమ్ పెట్టుకుని మరీ మ్యాచ్‌లో బరిలోకి దిగి ఆసీస్‌ను వణికించాడు. 15 నెలలుగా ర్యాన్ బర్ల్‌కు స్పాన్సర్లు లేరు. అలాగనీ- సొంతంగా క్రికెట్ కిట్‌ను కొనుక్కునే స్థోమత కూడా ర్యాన్ లేదు. షూస్ చిరిగిపోతే కొత్తవి కొనడానికీ డబ్బుల్లేని దుస్థితిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆస్ట్రేలియాపై చెలరేగాడు. తన లెగ్ స్పిన్ మాయాజాలంతో ఆసీస్ పనిపట్టి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఐదు వికెట్లతో పాటు ర్యాన్ మూడు క్యాచ్‌లను అందుకోవడం విశేషం.
2017లో అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో ర్యాన్ బర్ల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అదే ఏడాది సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టెస్టులోకి అరంగేట్రం చేశాడు. టీ20ల్లో ఎంట్రీ మా మాత్రం 2018లో చేశాడు. కాగా.. ఇప్పటి వరకు 3 టెస్టులు ఆడిన ర్యాన్ 4 వికెట్లు తీశాడు. అలాగే 34 వన్డేల్లో 17 వికెట్లతో పాటు 517 పరుగులు సాధించాడు. ఇక 47 టీ20ల్లో 32 వికెట్లతో పాటు 728 రన్స్‌చేశాడు. మరి ఇంత మంచి ప్లేయర్ స్పాన్సర్లు లేక ఇబ్బంది పడుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియాను కుప్పకూల్చిన జింబాబ్వే! వాళ్లంటే ఆసీస్‌కు ఇంకా భయం పోలేదా?
#3rdODI | @ryanburl3 after his five-wicket haul 👇 pic.twitter.com/mHc6DSBv0X
— Zimbabwe Cricket (@ZimCricketv) September 3, 2022
Any chance we can get a sponsor so we don’t have to glue our shoes back after every series 😢 @newbalance @NewBalance_SA @NBCricket @ICAssociation pic.twitter.com/HH1hxzPC0m
— Ryan Burl (@ryanburl3) May 22, 2021