చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ టోర్నీలో అదరగొడుతున్నాడు. సూపర్ ఫామ్‌ను ప్రదర్శిస్తూ.. వరుసగా మూడు మ్యాచ్‌లలో 3 సెంచరీలు బాదేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్.. సారథిగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. శనివారం కేరళ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 124 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 129 పరుగులు చేశాడు. అంతకు ముందు మధ్య ప్రదేశ్, చండీగఢ్ జట్లతో జరిగిన మ్యాచ్‌లలో కూడా శతకాలు బాదాడు.
మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో 112 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సులతో 136 పరుగులు చేశాడు. చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో 143 బంతుల్లో 154 పరుగులు చేసి అదరహో అనిపించాడు. గతంలో ఆర్సీబీ ఆటగాడు దేవదత్త్ పడిక్కల్ వరుసగా నాలుగు మ్యాచ్‌లలో 4 సెంచరీలు చేశాడు. ఆదివారం జరిగే మ్యాచ్‌లో కూడా రుతురాజ్ సెంచరీ చేస్తే.. పడిక్కల్ సరసన నిలుస్తాడు. రుతురాజ్ ఫామ్‌పై CSK ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. CSK టీమ్ రుతురాజ్‌ను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. మరి వరుస సెంచరీలతో చెలరేగుతున్న రుతురాజ్ ఫామ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
RUTeen in Yellove 💯🔁🚀#VijayHazareTrophy #WhistlePodu🦁💛 @Ruutu1331pic.twitter.com/fyg3AJYuKM
— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) December 9, 2021
Just Yellove Things! 🚀💯#VijayHazareTrophy #WhistlePodu🦁💛 pic.twitter.com/65Eu4MK4yt
— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) December 8, 2021
Rituraj Gaikwad in his prime form in 2021.
He has three consecutive 💯 in the ongoing Vijay Hazare Trophy for Maharashtra, again in Yellow 🟡💛💛#VijayHazareTrophy #Maharashtra #RuturajGaikwad pic.twitter.com/lnHh8BLuV4
— Kane Mama (@SmilesonDolan) December 11, 2021
3️⃣ Centuries in 3️⃣ Innings!
That is some start to the #VijayHazareTrophy for Maharashtra Captain Ruturaj Gaikwad! pic.twitter.com/2fXesnoeQ9
— 100MB (@100MasterBlastr) December 11, 2021