న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసి మంచి జోరు మీదున్న టీమిండియాకి బిగ్ షాక్ తగిలింది. టీ20 సిరీస్ కి ముందు జట్టు నుంచి ఓ స్టార్ ప్లేయర్ తప్పుకున్నాడు. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ముంగిట జట్టు నుంచి స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడు. మణికట్టు గాయం కారణంగా అతడు సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అతడిని బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో రిపోర్ట్ చేయాల్సిందిగా చెప్పినట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అతడి స్థానంలో జట్టులోకి మరెవరినీ తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఎందుకంటే అతడి స్థానంలో ఓపెనింగ్ చేసేందుకు పృథ్వీ షా అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే రుతురాజ్ ఇటీవల హైదరాబాద్ తో జరుగుతున్న రంజీ మ్యాచ్ లో గాయపడినట్లు చెబుతున్నారు. కోలుకుంటాడేమో అని ఆఖరి నిమిషం వరకు ఎదురుచూశారని.. కానీ, అతను పూర్తి ఫిట్ గా లేకపోవడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.అందుకే తొలి టీ20కి ఒకరోజు ముందు ఈ విషయాన్ని వెల్లడించారంటున్నారు. ఈ వార్త విన్న తర్వాత టీమిండియా అభిమానులు ఒకింత షాకయ్యారు. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ ఇటీవలి కాలంలో రంజీల్లో అద్భుతంగా రాణించాడు. మంచి ఫామ్ లో ఉన్న రుతురాజ్ ఇప్పుడు వైదొలిగాడని తెలిసి అంతా నిరాశ చెందారు. రుతురాజ్ మణికట్టు గాయంలో వైదొలగడం ఇది తొలిసారే కాదు. గతేడాది శ్రీలంకతో జరుగిన టీ20 సిరీస్ నుంచి కూడా రుతురాజ్ ఇలాగే మణికట్టు గాయంతో తప్పుకున్నాడు.
రుతురాజ్ గైక్వాడ్ ఫిట్ నెస్ విషయంలో బీసీసీఐ కూడా అసంతృప్తితో ఉన్నట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫిట్ నెస్ విషయంలో రుతురాజ్ సీరియస్ గా ఉన్నాడా? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయంటున్నారు. ఇంక టీ20 సిరీస్ విషయానికి వస్తే.. రుతురాజ్ తప్పుకోవడంతో పృథ్వీ షాకి లైన్ క్లియర్ అయినట్లు అయ్యింది. అతను తప్పకుండా ఓపెనర్ గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టీ20 సిరీస్ కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సిరాజ్, షమీలకు విశ్రాంతి ఇచ్చారు. హార్దిక్ పాండ్యా, శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, కుల్దీప్ యాదవ్ జట్టులో కొనసాగనున్నారు. జనవరి 27న తొలి టీ20(రాంచీ), జనవరి 29న రెండో టీ20(లక్నో), ఫిబ్రవరి 1న మూడో టీ20(అహ్మదాబాద్) జరగనుంది. వన్డే సిరీస్ తరహాలోనే ఈ టీ20 సిరీస్ ని కూడా టీమిండియా క్లీన్ స్వీప్ చేయాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Ruturaj Gaikwad has been ruled out. #RuturajGaikwad #INDvsNZ #Cricket #CricketTwitter pic.twitter.com/JGRH3jBzE5
— RVCJ Sports (@RVCJ_Sports) January 26, 2023