IPL 2023లో ఆడిన రెండు మ్యాచు ల్లోనూ అర్ధ సెంచరీలతో చెలరేగిపోయి ఆడాడు రుతురాజ్. ఈ క్రమంలోనే ఒక కొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు గైక్వాడ్. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని ఈ అరుదైన రికార్డుని ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ నెలకొల్పడం విశేషం. ఆ రికార్డ్ ఏంటంటే?
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్ లో రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. తనదైన టైమింగ్ షాట్స్ తో చాలా ప్రశాంతంగా బ్యాటింగ్ ఆడుతుంటాడు రుతురాజ్. ఇక బ్యాటింగ్ ఆడడం ఇంత ఈజీనా అన్నట్లు సొగసైన బ్యాటింగ్ తో మెప్పిస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచు ల్లోనూ అర్ధ సెంచరీలతో చెలరేగిపోయి ఆడాడు రుతురాజ్. ఈ క్రమంలోనే ఒక కొత్త రికార్డు తన ఖాతాలో వేసుకుంటున్నాడు గైక్వాడ్. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని ఈ అరుదైన రికార్డు ఈ చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ నెలకొల్పడం విశేషం. ఆ రికార్డ్ ఏంటంటే?
2020లో తొలిసారి చెన్నై జట్టులో చేరిన గైక్వాడ్ ఆ సీజన్లో చివర్లో కొన్ని మ్యాచులు ఆడి మంచి ప్రదర్శన చేసాడు. ఈ ప్రదర్శన గమనించిన ధోని తర్వాత సీజన్ లో ముందు నుంచే ఆడించారు. ఇక 2021 ఐపీఎల్ సీజన్ లో ఏకంగా ఆరు వందలకు పైగా పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్, లక్నో తో జరిగిన మ్యాచ్ ల్లో అర్ధ సెంచరీలు చేసి అదరగొట్టాడు. ఈ మ్యాచుల ద్వారా గైక్వాడ్ అన్ని జట్ల మీద అర్ధ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా నిలిచాడు. ప్రస్తుతం ఐపీఎల్ ల్లో 10 జట్లు ఆడుతుండగా.. ఈ చెన్నై ఓపెనర్ తొమ్మిది జట్లు(లక్నో, గుజరాత్, రాజస్థాన్, ముంబై , పంజాబ్, ఢిల్లీ, సన్ రైజర్స్, కేకేఆర్, ఆర్సీబీ,) జట్లపై 50 కి పరుగులు చేసాడు. ఈ రికార్డ్ ఇప్పటివరకు ఏ ఆటగాడికి లేకపోవడం విశేషం. ఇక ఈ రోజు ముంబై, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ లో గైక్వాడ్ ఎలాంటి ప్రదర్శనతో ఆకట్టుకుంటాడో చూడాలి. మరి గైక్వాడ్ నెలకొల్పిన ఈ రికార్డ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Crazy Fact:
Ruturaj Gaikwad is the only player in IPL history to score 50+ against all opponents played in IPL.
No VK, No Rohit 😳 pic.twitter.com/h47rGfCzG6
— AR (@31_FOREVER_) April 8, 2023