రంజీల్లో సెంచరీల మీద సెంచరీలు సాధించి.. రికార్డులు సృష్టించాడు రుతురాజ్. తాజాగా ప్రారంభం అయిన ఐపీఎల్ 2023లో సైతం తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు ఈ యువ క్రికెటర్. మరి ఇంతలా రాణిస్తున్నా అతడి రోల్ మోడల్ ఎవరు అని అడిగితే.. ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. విరాట్ కోహ్లీ, ధోనిలు తన రోల్ మోడల్ కాదని.. అతడే నా ఇన్స్పిరేషన్ అంటూ చెప్పుకొచ్చాడు.
రుతురాజ్ గైక్వాడ్.. గత కొంత కాలంగా ఇండియన్ క్రికెట్ లో మారుమ్రోగుతున్న పేరు. రంజీల్లో సెంచరీల మీద సెంచరీలు సాధించి.. రికార్డులు సృష్టించాడు రుతురాజ్. దాంతో అతడి పేరు క్రికెట్ వర్గాల్లోహాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా ప్రారంభం అయిన ఐపీఎల్ 2023లో సైతం తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు ఈ యువ క్రికెటర్. చెన్నై తరపున ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న ఈ యంగ్ ప్లేయర్ అంచానాలకు తగ్గట్లుగా రాణిస్తున్నాడు. బరిలోకి దిగిన రెండు మ్యాచ్ ల్లో సత్తా చాటా టోర్నీలో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. మరి ఇంతలా రాణిస్తున్నా అతడి రోల్ మోడల్ ఎవరు అని అడిగితే.. ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. విరాట్ కోహ్లీ, ధోనిలు తన రోల్ మోడల్ కాదని.. అతడే నా ఇన్స్పిరేషన్ అంటూ చెప్పుకొచ్చాడు. మరి గైక్వాడ్ ఇన్స్పిరేషన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
రుతురాజ్ గైక్వాడ్.. గతకొంత కాలంగా స్థిరంగా పరుగులు చేస్తూ.. టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాడు. ఇక రంజీల్లో అయితే.. వరుసగా సెంచరీల మీద సెంచరీలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ లో సైతం తనదైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన అభిమాన ఆటగాడు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. తన అభిమాన క్రికెటర్ సురేష్ రైనా అంటూ చెప్పుకొచ్చాడు. అతడే నా రోల్ మోడల్ అని, అతడిలా చెన్నై టీమ్ కు ఆడాలని ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే క్రికెట్ లోకి వచ్చే చాలా మంది యంగ్ ప్లేయర్స్ తమ రోల్ మోడల్స్ సచిన్, విరాట్, ధోని లాంటి వాళ్ల పేర్లు చెబుతారు. కానీ గైక్వాడ్ మాత్రం తన ఇన్స్పిరేషన్ సురేష్ రైనా అని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.
Ruturaj Gaikwad picks former Indian and CSK batter Suresh Raina as his inspiration ❤️#CricTracker #RuturajGaikwad #SureshRaina pic.twitter.com/pJg9XIyevg
— CricTracker (@Cricketracker) April 4, 2023