సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో మనసుని హత్తుకునే సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ చేసి విండీస్ ఓడిపోయినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల మనసు కొల్లగొట్టాడు కరేబియన్ సారథి రోవ్ మన్ పావెల్.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే లవ్ ప్రపోజల్స్, మ్యారేజ్ ప్రపోజల్స్, ముద్దులు పెట్టుకోవడం, ఆటగాళ్లు గొడవ పడటం లాంటి సంఘటనలను మనం చాలానే చూశాం. అయితే తాజాగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ చేసి విండీస్ ఓడిపోయినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల మనసు కొల్లగొట్టాడు కరేబియన్ సారథి రోవ్ మన్ పావెల్. ఈ మ్యాచ్ లో ఓ బౌండరీని ఆపే క్రమంలో.. పిల్లలకు ఎక్కడ దెబ్బలు తగులుతాయో అని తనను తానే గాయపర్చుకున్నాడు విండీస్ కెప్టెన్ రోవ్ మన్ పావెల్. దాంతో అతడిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆదివారం(మార్చి 26) దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. ప్రపంచ రికార్డులు బద్దలు అయ్యాయి. ఇక సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ థండర్ ఇన్నింగ్స్ తో సెంచరీ చేయడంతో.. దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. ఇందంతా కొద్దిసేపు పక్కన పెడితే.. ఈ మ్యాచ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల హృదయాలను కొల్లగొట్టాడు విండీస్ కెప్టెన్ రోవ్ మన్ పావెల్. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాటర్ కొట్టిన బాల్ బౌండరీ వైపు వెళ్తోంది. దాని వెనకాలే స్పీడ్ గా పరిగెత్తుతున్నాడు పావెల్.
ఈ క్రమంలోనే బౌండరీ లైన్ అవతల ఓ చిన్న పిలాడితో పాటుగా ఓ కుర్రాడు ఉన్నాడు. పావెల్ ఆ బౌండరీని ఆపే క్రమంలో స్పీడ్ గా వస్తున్నాడు.. అతడి వేగం చూస్తే.. ఆ పిల్లలను ఢీ కొట్టడం ఖాయమే అనుకున్నారు అంతా! కానీ ఇక్కడే పావెల్ తన గోప్ప మనసు చాటుకున్నాడు. తన స్పీడ్ ను నిగ్రహించుకుని వారిద్దరిని ఢీ కొట్టకుండా తప్పించుకుని అక్కడ ఉన్న బారీ కేడ్ ను గుద్దుకున్నాడు. అయితే పిల్లాడు అక్కడ లేకపోతే పావెల్ ఆ బంతిని ఆపేవాడే. కానీ చిన్న పిల్లలు దృష్టింలో ఉంచుకుని పావెలు వారికి దెబ్బలు తగల కుండా తనని తానే గాయపర్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ అభిమానులు పావెల్ ను ప్రశంసిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 258 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో చార్లెస్(118) భారీ శతకంతో చెలరేగాడు. అనంతరం 259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డి కాక్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచారు.
SPIRIT OF CRICKET – Rovman Powell puts his body on the line and nearly injures himself instead of crashing into two little ball boys. Top humanitarian effort by the WI Captain! pic.twitter.com/KNNWcR5Jpg
— Israr Ahmed Hashmi (@IamIsrarHashmi) March 26, 2023