ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ ల హవా నడుస్తోంది. బిగ్ బాష్ లీగ్, ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లతో పాటుగా సౌతాఫ్రికా టీ20 లీగ్ లు జరుగుతున్నాయి. ఈ లీగ్ ల్లో బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతున్నారు. తాజాగా యూఏఈ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ లీగ్ టీ20(ILT20)లో తుపాన్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు విండీస్ హిట్టర్ రోవ్ మెన్ పావెల్. ఆకాశమే హద్దుగా చెలరేగిన పావెల్ ప్రత్యర్థి బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించాడు. ఆదివారం దుబాయ్ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఎమిరైట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో దుబాయ్ క్యాపిటల్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు క్యాపిటల్స్ బ్యాటర్ రోవ్ మెన్ పావెల్.
సునామీ బ్యాటింగ్, థండర్ ఇన్నింగ్స్.. ఊచకోత.. ఈ పేర్లు కూడా సరిపోవేమో ఆదివారం పావెల్ ఆడిన ఆటతీరును పోల్చడానికి. ముంబై క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో తన విశ్వరూపాన్నే చూపించాడు విండీస్ హార్డ్ హిట్టర్ పావెల్. తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ జట్టు పరుగుల వరద పారించింది. సంచలన ఇన్నింగ్స్ ఆడిన పావెల్.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. సిక్సర్ల వర్షం కురిపించాడు. 41 బంతులు ఎదుర్కొన్న పావెల్ 4 సిక్సర్లు, 10 ఫోర్లతో 97 పరుగులు చేసి తృటిలో సంచరీ మిస్ అయ్యాడు. సెంచరీ చేయకపోయినప్పటికీ జట్టుకు మాత్రం భారీ స్కోరును అందించాడు.
Ten sixes 🔥
Captain Rovman Powell leads Dubai Capitals to an imposing 222 against MI Emirates #ILT20
— ESPNcricinfo (@ESPNcricinfo) January 22, 2023
పావెల్ విధ్వంసంతో దుబాయ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 222 పరుగుల భారీ స్కోరు చేసింది. జట్టులో ఉతప్ప(26) పరుగులు చేయగా.. టెస్టు బ్యాటర్ అంటూ పిలుస్తున్న జో రూట్.. తన శైలికి విరుద్దంగా ఈ మ్యాచ్ లో చెలరేగాడు. 54 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 రన్స్ చేశాడు రూట్. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఎమిరైట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. జట్టులో విండీస్ విధ్వంసకర వీరుడు, ఎమిరైట్స్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ ఒంటరి పోరాటం చేశాడు. 38 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్ లతో 86 పరుగులు చేశాడు పోలార్డ్. అయినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. మరి 10 సిక్సర్లతో చెలరేగిన పావెట్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rovman Powell was awarded player of the Match for his all-round show against MI Emirates.#CricTracker #DPWorldILT20 pic.twitter.com/o83YNXRysv
— CricTracker (@Cricketracker) January 22, 2023
#RovmanPowell #Bawaal macha raha hai 🔥.
Follow @ilt20onzee for the live action #MIEvDC #CricketOnZee #BawaalBingeWeekend #DPWorldILT20 @Dubai_Capitals @MIEmirates pic.twitter.com/U6tClKRbN8
— ZeeCinema (@zeecinema) January 22, 2023