టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిరీస్‌ల మీద సిరీస్‌లు వైట్‌వాష్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే తన దృష్టి గురువారం నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక టీ20 సిరీస్‌పై పెట్టాడు. ఇప్పటికే వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లను వైట్‌వాష్ చేసిన రోహిత్ సేన శ్రీలంక పనిపట్టేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఆటగాళ్లు బయోబబుల్‌లో ఉంటున్నారు. దీంతో తమ కుటుంబసభ్యులతో కలుసుకోలేకపోతున్నారు. దీంతో కుటుంబసభ్యులు వారిని మిస్ అవుతున్నారు. కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇవేవి పట్టించుకోని రోహిత్.. జట్టు విజయాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు.
వెస్టిండీస్‌తో సిరీస్ ముగియగానే శ్రీలంకతో జరగబోయే సిరీస్‌లో ఎలా గెలవాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నాడు. ఈ క్రమంలో తన భార్య రితికా శర్మ ఫోన్ చేసినా కూడా రోహిత్ లిఫ్ట్ చేయడం లేదని తెలుస్తుంది. అందుకే ‘ఒక సారి నాకు కాల్ బ్యాక్ చేయగలవా.. ప్లీజ్’ అంటూ రితికా ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ పోస్టుకు కామెంట్ పెట్టింది. ఇది చూసిన నెటిజన్లు.. రోహిత్ టీమిండియా కెప్టెన్ అయిన తర్వాత భార్యను కూడా పట్టించుకోట్లేదని కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.