ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఒక్క తప్పుతో మ్యాచ్ చేజారిందని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఒక్క తప్పు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గత కొన్ని నెలలుగా టీమిండియా వరుస విజయాలతో మంచి జోరుమీదుంది. ఇక అదే జోరును బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని తొలి రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో చూపించింది. అయితే మూడో టెస్ట్ కు వచ్చే సరికి ఆసిస్ పుంజుకుని టీమిండియాకు భారీ షాక్ నే ఇచ్చింది. ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓటమి దాదాపు ఖాయం అయినట్లే.. ఏదో అద్భుతం జరిగితే తప్ప భారత్ విజయం సాధించదు. అయితే గత రెండు మ్యాచ్ ల్లో ఆసిస్ చేసిన తప్పే భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేశాడు. రోహిత్ చేసిన ఒక్క తప్పు కారణంగానే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇంతకి రోహిత్ చేసిన తప్పు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా ఇండియా-ఆసిస్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆసిస్ విజయం నల్లేరు పై నడకే అని ఇప్పటికే తేలింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమికి రోహిత్ శర్మ చేసిన ఏకైక తప్పే కారణంగా నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ తప్పు ఏంటంటే? క్రికెట్ మ్యాచ్ కు ముందు ఆటగాళ్లు ముఖ్యంగా ఆలోచించేది పిచ్ గురించి, దాని తర్వాత టాస్ గురించి. ఇక జట్టు కెప్టెన్ కు పిచ్ గురించి పూర్తి అవగాహన ఉంటే బ్యాటింగ్ తీసుకోవాలో లేదా బౌలింగ్ తీసుకోవాలో ముందే నిర్ణయించుకుంటాడు. అయితే గత రెండు టెస్టుల్లో ఆసిస్ చేసిన తప్పునే మూడో టెస్ట్ లో రోహిత్ శర్మ చేశాడు.
ఈనేపథ్యంలో గత రెండు టెస్టుల్లో ఆసిస్ మెుదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ రెండు మ్యాచ్ ల్లో ఆసిస్ ఘోర పరాజయాల్ని చవిచూసిన సంగతి తెలిసిందే. వాటిని చూసిన తర్వాత కూడా రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం ఏంటని అభిమానులు, క్రికెట్ మాజీలు ప్రశ్నిస్తున్నారు. అదే రోహిత్ బౌలింగ్ తీసుకుని ఉంటే కథ వేరేలా ఉండేదని వారి వాదన. ఇక ఆస్ట్రేలియా ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. దాంతో టీమిండియా ఓటమి దాదాపు ఖాయం అయినట్లే అని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరి రోహిత్ శర్మ చేసిన తప్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.