టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ తను అనుకున్న ప్లాన్‌ను పక్కాగా అమలు చేస్తూ మంచి ఫలితాలు రాబడుతున్నాడు. టీ20, వన్డే వరల్డ్‌లే లక్ష్యంగా జట్టును నిర్మించుకుంటున్న క్రమంలో సీనియర్ ఆటగాళ్లకు కావాల్సిన స్పేస్‌ను ఇస్తున్నాడు. అందులో భాగంగా టీమిండియాలో ఎప్పటి నుంచో ఉన్న రవీంద్ర జడేజాను ఒక అద్భుత ఆయుధంగా మారుస్తున్నాడు. జడేజా ధోని కెప్టెన్సీలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా.. జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో కూడా జడేజా ఆడినా కూడా హర్థిక్ పాండ్యాతో పోటీని ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు రోహిత్ మాత్రం జడేజాకు పూర్తి అభయం ఇస్తున్నాడు. దీంతో జడేజా చెలరేగిపోతున్నాడు. టీ20ల్లో కూడా జడేజాను బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేస్తూ టాప్ ఆర్డర్‌లో ఆడే అవకాశం కల్పిస్తున్నాడు. పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న జడేజాను అదేస్థాయిలో వాడుకుంటే జట్టుకు ఎంతో ఉపయోగపడతాడు.
మరో యువీలా..
ధోని కెప్టెన్సీలో భారత జట్టు వన్డే, టీ20 ప్రపంచకప్‌లను సాధించింది. ఆ రెండు టైటిల్స్ సాధించడంలో యువీ ఎంతో ఉంది. నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో జట్టుకు వెన్నుముకలా ఉండే వాడు. ఇప్పుడు టీమిండియా యువీలేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లోటుపై విరాట్ కోహ్లీ అంతగా దృష్టి పెట్టలేదని క్రికెట్ నిపుణుల అభిప్రాయం. రోహిత్ శర్మ మాత్రం ఆ లోటును ముందే గ్రహించినట్లు తెలుస్తుంది అందుకే యువీ స్థానాన్ని జడేజాతో భర్తీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే అతనికి టాప్ ఆర్డర్‌లో కూడా అవకాశం కల్పిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో కూడా జడేజా అద్భుతంగా రాణించాడు. ఏకంగా 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది కానీ.. లేకుంటే జడేజా డబుల్ సెంచరీ బాదేవాడు. మరి జడేజా బ్యాటింగ్‌పై, రోహిత్ అతనికి కల్పిస్తున్న అవకాశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Jaddu brings up his 2nd Test CENTURY 👏#INDvSL #RavindraJadeja @imjadejahttps://t.co/4ZWZuwDFwV pic.twitter.com/Qrf5rhPD4u
— Ravindra jadeja fan😎 (@Jadeja123457) March 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.