టీమిండియా అనగానే కోహ్లీ-రోహిత్ శర్మనే గుర్తొస్తారు. గత 10-15 ఏళ్లుగా జట్టుకు ఆడుతున్న ఈ ఇద్దరూ కూడా ఎవరికీ వారు తమ అద్భుతమైన, అసమాన బ్యాటింగ్ తో లెక్కలేనన్ని రికార్డులు సృష్టించారు. రోహిత్ శర్మ ఓపెనర్ గా వస్తే, వన్ డౌన్ లో వచ్చే కోహ్లీ.. తమ బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించేవారు. ఇప్పటికీ చూపిస్తూనే ఉన్నారు. అయితే 2019 వరల్డ్ కప్ కంటే ముందు మాత్రం వీళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత గొడవలు జరిగాయని అప్పట్లో తెగ మాట్లాడుకున్నారు. అందులో నిజమెంతనేది తెలియదు గానీ న్యూస్, సోషల్ మీడియాలో మాత్రం అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్. వాటి గురించిన అసలు నిజాలు ఇప్పుడు బయటపడ్డాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ లో టీమిండియా, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి ఇంటికొచ్చేసింది. దిగ్గజ ధోనీకి ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్. ధోనీ ఉన్నంతవరకు బాగానే ఉంది. కానీ అతడి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాతే అసలు కథ మొదలైంది. బయటకు చెప్పకపోయినప్పటికీ.. కోహ్లీ-రోహిత్ మధ్య గొడవలు జరిగాయి. అందుకు ఎగ్జాంపుల్ అన్నట్లు కోహ్లీ షేర్ చేసే ఫొటోల్లో రోహిత్ ఉండేవాడు కాదు. రోహిత్ పోస్ట్ చేసే ఫొటోల్లో కోహ్లీ కనిపించేవాడు కాదు. ఇద్దరూ ఇన్ స్టాలోనూ అన్ ఫాలో చేసుకోవడంతో ఫ్యాన్స్ మధ్య గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. 2020 ఐపీఎల్ అయిపోయిన తర్వాత టీమిండియా.. దుబాయి నుంచి డైరెక్ట్ గా ఆస్ట్రేలియా వెళ్లిపోయింది. రోహిత్ స్వదేశానికి వచ్చేశాడు. ఇక ఆస్ట్రేలియాలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కోహ్లీ మాట్లాడుతూ.. రోహిత్ ఈ టూర్ కి ఎందుకు రాలేదు తనకు తెలియదని అన్నాడు. ఇది కాస్త అప్పట్లో చర్చనీయాంశమైంది.
ఇక ఆసీస్ తో టీ20, వన్డే సిరీస్ అయిపోయిన తర్వాత కోహ్లీ.. పితృత్వ సెలవులపై ఇండియాకు రిటర్న్ వచ్చేశాడు. సరిగ్గా అదే టైంకి రోహిత్.. ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లాడు. ఇలా అంతా జరుగుతుండేసరికి.. ఈ ఇద్దరి మధ్య గొడవలు తీవ్రస్థాయికి వెళ్లిపోయాయని తెగ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇదే విషయమై టీమిండియా ఫీల్డింగ్ మాజీ కోచ్ ఆర్.శ్రీధర్ ఓపెన్ అయ్యాడు. అసలు నిజాలు చాలానే బయటపెట్టాడు. ‘2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు డ్రస్సింగ్ రూం గురించి చాలా డిస్కషన్ జరిగింది. రోహిత్, కోహ్లీ.. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. రెండు సెపరేట్ గ్రూపులు కూడా ఉండేవి. విండీస్ తో టీ20 సిరీస్ కోసం యూఎస్ వెళ్లాం. అక్కడికి వెళ్లగానే.. కోహ్లీ, రోహిత్ శర్మను కోచ్ రవిశాస్త్రి తన గదికి పిలిపించుకున్నాడు’
‘ఇద్దరి మధ్య గొడవలకు పుల్ స్టాప్ పెట్టాలని కోహ్లీ-రోహిత్ ఇద్దరికీ కూడా రవిశాస్త్రి చెప్పాడు. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో వదిలేయండి.. మీరు ఇద్దరూ టీమ్ లో సీనియర్స్.. ధోనీ రిటైర్ అయిన తర్వాత మీరిద్దరూ జట్టులోకి మిగిలిన క్రికెటర్లకు రోల్ మోడల్ గా ఉండాలి. మీ మధ్య ఏమున్నా సరే అవన్నీ పక్కనబెట్టేసి కలిసి ముందుకు వెళ్లాలని రవిశాస్త్రి తేల్చి చెప్పేశాడు. ఆ తర్వాత ఇద్దరిలోనూ మార్పు కనిపించింది. నవ్వుతూ విష్ చేసుకోవడం, మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో రోహిత్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇతడి హెల్ప్ లేకుండా కెప్టెన్, తన జట్టుని లీడ్ చేయడం కష్టం. ఇది కోచ్ రవిశాస్త్రికి తెలుసు. అందుకే కోహ్లీ-రోహిత్ ఇద్దరూ కూడా తమ ప్రాబ్లమ్స్ గురించి చెప్పలేదు. కొత్తగా మొదలుపెట్టాలని చేతులు కలిపారు.’ అని మాజీ కోచ్ ఆర్.శ్రీధర్ చెప్పుకొచ్చాడు. పైన చెప్పిన విషయాలన్నీ కూడా తన ఆటో బయోగ్రఫీ ‘కోచింగ్ బియాండ్: మై జర్నీ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్’ అనే పుస్తకంలో రాసుకొచ్చాడు. దీంతో ఇదికాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి కోహ్లీ-రోహిత్ గొడవలు నిజంగా జరగడంపై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
R Sridhar revealed how Ravi Shastri handled Virat Kohli vs Rohit Sharma episode in West Indies 10 days after India’s ODI WC exit in his book ‘Coaching Beyond’. pic.twitter.com/8IlaXgCwns
— CricTracker (@Cricketracker) February 4, 2023