ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్, విరాట్, ధావన్ వీరవిహారం చేసిన సంఘటనను భారత క్రికెట్ అభిమానులు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి మ్యాచ్‌ను మరోసారి చూడాలని ఉందని అంటున్నారు. మరి ఆ మ్యాచ్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్-ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టెస్టుల్లో సాధించిన విజయంతో రెట్టించిన ఉత్సాహంతో భారత్ వన్డే సిరీస్‌కు సిద్ధం కానుంది. అలాగే ఈ ఏడాది భారత్‌లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ దృశ్యా.. ఈ మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా సైతం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ సిరీస్‌లో విజయం సాధిస్తే.. ఇండియాలో సిరీస్ గెలిచిన ఉత్సాహంతో వరల్డ్‌కు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగొచ్చనేది ఆస్ట్రేలియా ప్లాన్. మరోవైపు ఆస్ట్రేలియాకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు వన్డేల సిరీస్ మంచి రసవత్తరంగా జరగనున్నడం ఖాయం. అయితే.. గతంలో ఒకసారి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ వీరవిహారం చేసిన మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇప్పుడు తాజా భారత క్రికెట్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి మ్యాచ్‌ను మరోసారి చూడాలని ఉందని అంటున్నారు. మరి ఆ మ్యాచ్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
2013లో ఆస్ట్రేలియా ఇక టీ20, 7 వన్డేల సిరీస్‌లు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చింది. తొలుత జరిగిన టీ20లో టీమిండియా విజయం సాధించగా.. తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొలి వన్డేలో 304 పరుగుల కొట్టి.. 72 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా.. రెండో వన్డేలోనూ 359 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో మరో విజయం తమ ఖాతాలో వచ్చిపడిందని ఆస్ట్రేలియా ఉబ్బితబ్బిబైంది. ఆరోన్ ఫించ్, ఫిలిప్, షేన్ వాట్సన్, జార్జ్ బెయిలీ, మ్యాక్స్‌వెల్ టాప్ బ్యాటర్లందరూ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా భారీ టార్గెట్‌ను భారత్ ముందు ఉంచింది. ఈ టార్గెట్‌ను ఛేదించేందుకు శిఖర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 123 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సులతో 141 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శిఖర్ ధావన్ 86 బంతుల్లో 14 ఫోర్లతో 95 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.
ఇక వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ.. సునామీ ఇన్నింగ్స్ ఆడి 52 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సులతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి మ్యాచ్‌లో 304 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేకపోయిన జట్టు.. రెండు వన్డేలో దెబ్బతిన్న పులిలా ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాక్‌పై విరుచుకుపడింది. మిచెల్ జాన్సన్, మెక్‌కాయ్, షేన్ వాట్సన్, మ్యాన్స్‌వెల్, ఫాల్కనర్లను పచ్చికొట్టుడు కొట్టిన టీమిండియా టాప్ త్రీ బ్యాటర్లు.. కేవలం ఒక్క వికెట్ మాత్రం కోల్పోయి 362 పరుగులు బాదేశారు. అది కూడా కేవలం 43.3 ఓవర్లలోనే. 176 వద్ద ధావన్ వికెట్ కోల్పోయిన టీమిండియా.. ఇంకో వికెట్ పడకుండా.. రోహిత్-కోహ్లీల జోడీ అన్‌బీటెన్‌గా నిలిచింది. అప్పటి వరకు టీమిండియాను అంత పెద్ద టార్గెట్ ఛేదించడం కల అని భావించిన కంగారుల గర్వం అణుస్తూ.. రోహిత్, ధావన్, కోహ్లీ దుమ్ములేపారు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ముందు భారత క్రికెట్ అభిమానులు ఆ మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటున్నారు.