టీమిండియా నయా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గ్రౌండ్‌లో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో.. సోషల్ లైఫ్‌లో అంత కూల్‌గా ఉంటాడు. రోహిత్‌కు సోషల్ మీడియాలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్‌లో 20.2 మిలియన్లు, ఇన్‌స్టాలో 22.6 మిలియన్ల మంది రోహిత్‌ను ఫాలో అవుతున్నారు. తనను ఫాలో అవుతున్న ఫ్యాన్స్‌కు తన ఉన్నారు. ఇన్‌స్టా అకౌంట్‌ను వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసేందుకు మాత్రమే ఉపయోగించే హిట్‌మ్యాన్.. ట్విట్టర్‌లో మాత్రం క్రికెట్‌కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంటాడు. కానీ మంగళవారం రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్లు అతని అభిమానులను అయోమయానికి గురి చేస్తున్నాయి.
‘నాకు కాయిన్ టాస్ అంటే ఇష్టం. ముఖ్యంగా అవి నా కడుపులోకి ఎప్పుడైతే చేరతాయో..’ అంటూ రోహిత్ అకౌంట్ నుంచి పలు అర్ధం పర్ధం లేని ట్వీట్లు వచ్చాయి. ఇవి చూసిన అభిమానులు రోహిత్‌కి ఏమైంది..? అర్ధంలేని ట్వీట్లతో ఏంటి దండయాత్ర అంటూ ట్విట్టర్లో చర్చ పెట్టారు. ఎప్పుడూ ఇలాంటి ట్వీట్లు చేయని రోహిత్ కొత్తగా పిచ్చి పిచ్చి ట్వీట్లు చేస్తుండటంతో అతని అకౌంట్ హ్యాక్ అయ్యిందా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నాడు. అదే జరిగితే రోహిత్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఆ విషయాన్ని ధృవీకరిస్తే కానీ అసలు విషయం తెలియదు. కానీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం రోహిత్ శర్మకు పిచ్చిపట్టిందని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. మరి రోహిత్ ట్వీట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Cricket balls are edible…right?
— Rohit Sharma (@ImRo45) March 1, 2022
Bzz….! Did you know? Buzzing beehives make for great boxing bags!
— Rohit Sharma (@ImRo45) March 1, 2022
I love coin tosses…especially when they end up in my belly!
— Rohit Sharma (@ImRo45) March 1, 2022