టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ అంటే భయపడని బౌలర్లు ఉండరు. కానీ, వన్డే మ్యాచుల్లో మాత్రం ఈ 360 ప్లేయర్ బొక్కబోర్లా పడుతున్నాడు. ఆస్ట్రేలియాపై వరుసగా 3 సార్లు గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరి అత్యంత చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.
ఆస్ట్రేలియా విజాయనందంతో తమ పర్యటనను ముగించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయినా కూడా.. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరింది. ఇంక వన్డే సిరీస్ విషయానికి వస్తే.. 2-1 తేడాతో టీమిండియాని మట్టికరిపించింది. సాధారణంగానే ఎంతో పటిష్టమైన జట్టు టీమిండియా.. ఇంక సొంత గడ్డమీద అంటే మనల్ని ఎదుర్కోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ, ఇప్పుడు లెక్కలు మొత్తం తారుమారు అయ్యాయి. భారత్ పేలవ ప్రదర్శనతో సిరీస్ కోల్పోవడమే కాదు.. వచ్చే వరల్డ్ కప్ మీద కూడా అనుమానాలు పెరిగాయి. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ కెరీర్ గురించి ఇప్పుడు చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అది ఆషామాషీ విషయం కాదు. ఎందుకంటే క్రికెట్ ప్రపంచంలో హేమాహేమీ బ్యాటర్లను తలదన్ని నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. అలాంటి సూర్యకుమార్ యాదవ్ కెరీర్ నే ప్రమాదంలో పడేసే పనులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే పక్కా టీ20 ప్లేయర్ సూర్యని వన్డే ఫార్మాట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వచ్చే వన్డే వరల్డ్ కప్ కోసం సూర్యకుమార్ యాదవ్ ని ఆడించాలని ఇలాంటి పనులు చేస్తున్నారు. కానీ, సూర్య 3 మ్యాచుల్లో వరుసగా గోల్డెన్ డక్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
मेरा पानी उतरता देख, मेरे किनारे पर घर मत बसा लेना, मैं समंदर हूँ, लौटकर वापस आऊँगा! #SuryakumarYadav pic.twitter.com/nhPj5ksQWm
— Surya Kumar Yadav (@Surya14yadav) March 23, 2023
మూడో మ్యాచ్ లో అయితే సూర్య అవుట్ అయిన తర్వాత కూడా కాసేపు క్రీజులో నుంచి వెళ్లకుండా అలాగే ఉండిపోయాడు. ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ అతని ప్రదర్శన ట్విట్టర్ దార్వా తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. “సూర్యుడు రేపు మళ్లీ ఉదయిస్తాడు” అంటూ రోహిత్ శర్మ ట్విట్టర్ వేదికగా సూర్యకుమార్ యాదవ్ కి తన మద్దతుని తెలియజేశాడు. అయితే సూర్యని టీ20లకి వదిలేయాలని.. వన్డేలకు తీసుకొచ్చి అతని కెరీర్ దారి తప్పేలా చేయద్దంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సూర్యని వన్డేల్లోకి తెచ్చి అతని కెరీర్ నాశనం చేస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Mumbai Indians (@mipaltan) March 23, 2023