ఐపీఎల్ ఆడేందుకు రెడీ అయిన భారత ఆటగాళ్లకు రోహిత్ శర్మ హెచ్చరికలు జారీ చేశాడు. ఆసీస్ తో సిరీస్ లో ఓడిపోవడం వల్లనే ఇలాంటి కామెంట్స్ చేశాడా అనిపిస్తుంది.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో మన జట్టు ఎలాగైనా సరే గెలిచేస్తుందని టీమిండియా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయాడు. కానీ అలా జరగలేదు. తాజాగా చెన్నైలో జరిగిన నిర్ణయాత్మక మ్యాచులో మన ఆటగాళ్లు చేతులెత్తేశారు. టార్గెట్ ఛేదించలేక చతికిల పడిపోయారు. ఈ ఏడాది స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్ ఓటమి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. మరోవైపు త్వరలో ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. సరిగ్గా ఇలాంటి టైంలో కెప్టెన్ రోహిత్ శర్మ.. భారత జట్టుకు ఆడుతున్న క్రికెటర్లకు వార్నింగ్ ఇచ్చాడు. ఓ విషయంలో జాగ్రత్తగా ఉండాలని బల్లగుద్ది మరీ హెచ్చరించాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మన దేశంలో ప్రతిఏటా జరిగే ఐపీఎల్ కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ టోర్నీలో భారత స్టార్ ఆటగాళ్లు అందరూ దాదాపుగా పాల్గొంటూ ఉంటారు. కొన్నిసార్లు గాయాలబారిన పడినా కూడా ఆడేస్తూ ఉంటారు. మిగతా సీజన్ల సంగతేమోగానీ ఈ ఏడాది మాత్రం మన ఆటగాళ్లకు చాలా కీలకం. ఎందుకంటే అక్టోబరు-నవంబరులో వన్డే ప్రపంచకప్, అది కూడా ఇక్కడే జరగనుంది. ఇలాంటి టైంలో టీమిండియా క్రికెటర్లు ఒత్తిడి, రెస్ట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వరల్డ్ కప్ కు దూరమైపోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
‘ఐపీఎల్ లో ఆడే ఏ ప్లేయర్ అయినాసరే బ్రేక్ తీసుకోవడం అనేది ఫ్రాంచైజీ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే సదరు ఆటగాళ్లు వాళ్ల సొంతం కాబట్టి. ఈసారి మాత్రం మేం కొన్ని సూచనలు చేశాం. మరీ ముఖ్యంగా.. ఆటగాళ్లు ఎవరైనా సరే ఎక్కువగా ఆడేస్తున్నాం అనిపిస్తే 1-2 మ్యాచులు బ్రేక్ తీసుకోండి’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. దీన్నిబట్టి చూస్తుంటే.. టీమిండియా క్రికెటర్లకు ఇది చిన్నసైజ్ వార్నింగ్ లానే అనిపిస్తుంది. వన్డే వరల్డ్ కప్ కోసం ఫిట్ గా ఉండాలంటే కెప్టెన్ గా రోహిత్ శర్మ ఈ మాత్రం చేయాల్సి ఉంటుంది అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. రోహిత్ వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Rohit Sharma said “I doubt if any player will take a break during IPL, it’s all up to franchises, they own them now but we have given some indications & more importantly it’s up to players as if they feel they are getting too much, they can take a break for 1 or 2 games”.
— Johns. (@CricCrazyJohns) March 23, 2023