మిస్టర్ ఫినిషర్‌గా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన క్రికెటర్ దినేష్ కార్తీక్. అతను ఓ సారి బ్యాటింగ్‌కు దిగేందుకు రెడీ అయితే.. రోహిత్ శర్మ వద్దని ఆపేశాడంటా.. అది ఎప్పుడు? ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా వెటరన్ క్రికెటర్, ది ఫినిషర్ దినేష్ కార్తీక్ జీవితం ఎంతో మంది ఆదర్శం. ఒక ఆటగాడిగానే కాక.. వ్యక్తిగా కూడా డీకే ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తాడు. జీవితంలో ఎదురైన కష్టాలను దాటి.. అనుకున్నది సాధించిన అతని ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. టీమిండియా తరఫున ఎప్పుడో ధోని కంటే ముందే అడుగుపెట్టినా.. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కావడంతో ధోని కెప్టెన్‌గా ఉండటంతో డీకేకు అడపాదడపా అవకాశాలు మాత్రమే వచ్చాయి. కానీ.. దినేశ్ కార్తీక్ అంటే క్రికెట్ ఉన్నంత వరకు గుర్తుకువచ్చే ఇన్నింగ్స్ ఒకటి ఉంది. 2017 నిదాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై దినేష్ కార్తీక్ ఆడిన ఇన్నింగ్స్ ఏ క్రికెట్ అభిమాని కూడా మర్చిపోడు. ఆ ఇన్నింగ్స్‌తో డీకే క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
ఆ తర్వాత ఐపీఎల్‌లో కూడా సత్తా చాటిన డీకే.. 2019 తర్వాత మళ్లీ టీమిండియా తరఫున ఆడలేదు. ఆ తర్వాత క్రికెట్‌కు పూర్తిగా దూరమై కామెంటేటర్ అవతారవ కూడా ఎత్తాడు. కానీ.. మళ్లీ టీమిండియా రీఎంట్రీ ఇచ్చేందుకు కఠోరశ్రమ చేసిన డీకే.. ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఫినిషర్‌గా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దీంతో మళ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా.. ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ 2022 కోసం ఎంపిక చేసిన జట్టులో స్థానం సంపాదించాడు. అయితే.. వరల్డ్ కప్ టోర్నీలో అంతగా రాణించని డీకే.. మళ్లీ జట్టుకు దూరం అయ్యాడు. అయితే.. రానున్న ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ తరఫున బరిలోకి దిగనున్న డీకే.. ఆర్సీబీ పోడోకాస్ట్‌లో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నిదాస్ ట్రోఫీ ఫైనల్లో 2-3 ఓవర్ల సమయంలోనే తాను బ్యాటింగ్‌కు దిగాల్సి ఉన్నా.. అప్పుడు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ తనను వద్దని కూర్చోబెట్టాడని, తాను అప్పటికే ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్‌కు దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీకే తెలిపాడు. మనీస్ పాండే, విజయ్ శంకర్ తర్వాత తనను బ్యాటింగ్‌కు పంపినట్లు, అప్పటికీ 2 ఓవర్లలో 34 రన్స్ కావాల్సి ఉందని డీకే వెల్లడించాడు. అయితే.. ఆ మ్యాచ్‌లో ఇండియా గెలిచిందంటే అది డీకే వల్లనే. చివర్లో ఒత్తిడి తట్టుకుంటూ డీకే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు. కేవలం 8 బంతుల్లోనే 29 పరుగులు చేసి భారత్‌కు అపురూపమైన విజయం అందించాడు. చివరి బాల్‌కు 5 పరుగులు కావాల్సిన దశలో సిక్స్ బాది గెలిపించాడు. ఆ టైమ్‌లో డీకేను ఇండియా మొత్తం హీరోలా చూసింది. అయితే.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వెళ్దామనుకున్న డీకేను ఆపి రోహిత్ మంచి పడే చేశాడు. లేకుంటే లాస్ట్‌లో అలాంటి బ్యాటింగ్ ఎవరి వల్ల అయ్యేది కాదేమో. మరి ఈ నిదాస్ ట్రోఫీ ఫైనల్లో డీకే బ్యాటింగ్‌తో పాటు రోహిత్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.