ఎంత పెద్ద స్టార్స్ అయినా సరే వాళ్లకూ కొన్నికొన్ని నమ్మకాలుంటాయి. సినిమా షూటింగ్ కి ముందు పూజతో స్టార్ట్ చేస్తారు. సినిమా హిట్ అయితే పలానా చేస్తామని మొక్కుకుంటారు. ఇక సినీ సెలబ్రిటీల సంగతి పక్కనబెడితే.. క్రికెటర్లు కూడా ఇలాంటివి పాటిస్తుంటారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇప్పుడు అలానే చేశారు. ఏదైనా పెద్ద టోర్నీ ఉందంటే చాలు ఆ గుడికి వెళ్లే రోహిత్ శర్మ ఇప్పుడు కూడా అలానే వెళ్లి దైవదర్శనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలో అక్టోబరు 16 నుంచి టీ20 ప్రపంచకప్ జరగనుంది. అందుకోసం గురువారం ఉదయమే.. మన జట్టు అక్కడికి పయనమైంది. సూట్ వేసుకుని క్రికెటర్ల అందరూ ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇక ఈ టోర్నీకి బుమ్రా లాంటి బౌలర్ దూరం కావడం నిజంగా పెద్ద లోటే. ఇక బుమ్రా స్థానంలో సెలెక్షన్ కమిటీ ఎవరినీ ఎంపిక చేయలేదు. దీంతో 14 మంది ఆసీస్ లో జరగబోయే ప్రపంచకప్ కోసం ల్యాండ్ అయ్యారు. మరోవైపు రిజర్వ్ ఆటగాళ్లు.. దక్షిణాఫ్రికా టూర్ ముగిసిన తర్వాత ఆసీస్ కి పయనమవుతారు.
Rohit Sharma visited the Siddhivinayak temple with family before flying to Australia. pic.twitter.com/6bOyLhesWY
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 6, 2022
ఇకపోతే భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆసీస్ వెళ్లడం కంటే ముందు దసరా సందర్భంగా, ముంబయిలోని సిద్ధి వినాయక గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. టీ20 ప్రపంచకప్ గెలవాలని దేవుడ్ని గట్టిగా ప్రార్ధించినట్లు చెప్పుకొచ్చాడు. తన వెంట భార్య రితికాతోపాటు కూతురు సమైరా కూడా ఉంది. పెద్ద పెద్ద టోర్నీల్లో ఆడటం కంటే ముందు సిద్ధి వినాయక టెంపుల్ కి వెళ్లడం రోహిత్ కి ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ. ఇదిలా ఉండగా అక్టోబరు 23న పాకిస్థాన్ తో మ్యాచులో వరల్డ్ కప్ టోర్నీ భారత్ ప్రారంభించనుంది. అంతకంటే ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో వార్మప్ మ్యాచులు ఆడనుంది. మరోవైపు బుమ్రా గాయపడటంతో అతడి స్థానంలో షమి లేదా దీపక్ చాహర్ ని జట్టులోకి తీసుకునే అవకాశముంది. ఇదంతా పక్కనబెడితే రోహిత్, గుడికి వెళ్లి పూజలు చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Smiles, laughter and wishes as #TeamIndia left from Mumbai for Australia 📹📸 pic.twitter.com/Re60cUgnZx
— BCCI (@BCCI) October 7, 2022