భారత క్రికెట్ చరిత్రలో ధోని గొప్ప కెప్టెన్‌గా నిలవడానికి, టీమ్ విజయాలు సాధించడానికి అతని నిర్ణయాలే ప్రధాన కారణం. ప్లేయర్ సామర్థ్యాన్ని బట్టి, అతన్ని ఏ స్థానంలో ఆడించాలో ధోనికి బాగా తెలుసు. అందుకే రోహిత్ ఓపెనర్ అయ్యాడు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ విషయంలో కూడా రోహిత్, ధోనిలా ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
భారత క్రికెట్ జట్టులోకి ఆలస్యంగా వచ్చినా.. పెను విధ్వంసం సృష్టించాడు సూర్యకుమార్ యాదవ్. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో సంచలనంగా మారాడు. ఇలాంటి ఆటగాడిని వన్డేల్లో కూడా ఆడేలా మల్చుకుంటే.. 2023 వన్డే వరల్డ్ కప్ ఇండియాదే అని అంతా భావించారు. అందుకోసమే.. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ.. సూర్యను వన్డేల్లో ఆడిస్తున్నారు. గత వన్డే సిరీస్‌ల్లో సూర్య విఫలమైనా మళ్లీ అవకాశం కల్పిస్తున్నారు. కానీ, సూర్య మాత్రం ఆశించిన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేల్లోనూ డకౌట్ అయ్యాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై విమర్శలు మొదలయ్యాయి. అతను కేవలం టీ20లకు మాత్రమే పనికి వస్తాడంటూ, వన్డేలు, టెస్టులకు ఎంపిక చేయవద్దనే డిమాండ్ వినిపిస్తోంది.
అయితే.. సూర్యకుమార్ యాదవ్ టాలెంట్ విషయంలో ఎవరీ అనుమానం లేకున్నా.. అతని బ్రాండ్ ఆఫ్ క్రికెట్ వేరే అనే విషయంపై అందరికి ఒక అవగాహన ఉంది. తక్కువ ఓవర్లు ఉన్న సమయంలో సూర్య అద్భుతంగా చెలరేగి ఆడతాడు. కళ్ల ముందు కొండంత లక్ష్యం ఉన్నా.. సూర్య చెలరేగితే ఎంత పెద్ద కొండైన పిండి పిండి అవ్వాల్సిందే, అది సూర్య స్టామినా. మరి అలాంటి ప్లేయర్ వన్డేల్లో మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు. అయితే.. సూర్యను ఫామ్‌లోకి తేవడం ఇప్పుడు ఒక్క రోహిత్ శర్మ చేతుల్లోనే ఉందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. అది ఎలాగంటే.. జస్ట్ ధోనిలా ఆలోచిస్తే సరి. వన్డేల్లోనూ సూర్య విధ్వంసకర బ్యాటింగ్‌ను చూడొచ్చు.
ధోని గొప్ప కెప్టెన్ అయ్యాడంటే.. అది అతని డిసిషన్ మేకింగ్ వల్ల. సరైన నిర్ణయాలు తీసుకోవడం, మార్పులు చేయడంలో ధోని దిట్ట. ఇప్పుడు రోహిత్ కూడా అదే ఫాలో అవ్వాలి. ఒక ఆటగాడి సామర్థ్యాన్ని గుర్తించి, అతను ఆడే స్థానాన్ని కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిర్ణయించాలి. అది జట్టుకు ఎంతో మంచి చేస్తుంది. ధోని చేసిన ఆ మార్పుతోనే రోహిత్ శర్మ ఈ రోజు గొప్ప ఓపెనింగ్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గానే ఉండి ఉంటే.. రోహిత్ కెరీర్ ఎప్పుడో ముగిసిపోయి ఉండేది. ఇప్పుడు సూర్యకుమార్ విషయంలో రోహిత్ ఇదే సూత్రాన్ని పాటించాల్సి ఉంది. ముందుగా సూర్యకుమార్ యాదవ్ స్ట్రెంత్ ఏంటో గుర్తించాలి. అతను చివరి 10, 15 ఓవర్లలో విధ్వంసం సృష్టించగల ఆటగాడు. పిచ్ పరిస్థితి ఎలా ఉన్నా.. చివర్లో పరుగులు చేయడం సూర్య స్పెషాలిటీ.
ఆ ప్రత్యేకతనే రోహిత్ అర్థం చేసుకోవాల్సింది. సూర్యను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలి. ప్రస్తుతం అతను మిడిల్ ఆర్డర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఆ ప్లేస్‌లో హార్దిక్ పాండ్యాను ఆడించాలి. చాలా కాలంగా హర్దిక్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. అలా వచ్చిన సందర్భాల్లో మంచి ప్రదర్శనలు కూడా చేశాడు. తాను కెప్టెన్‌గా ఉన్న సమయంలో తనను తాను బ్యాటింగ్ ఆర్దర్‌లో ప్రమోట్ చేసుకున్నాడు. పరిస్థితులకు తగ్గట్లు భాగస్వామ్యాలు నెలకొల్పుతూ, బాగా ఆడుతున్నాడు. గతంలో ఉండే తత్తరపాటు ఇప్పుడు పాండ్యాలో కనిపించడం లేదు. పైగా టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ రిటైర్ అయిన తర్వాత.. నాలుగో స్థానంలో సరైన బ్యాటర్ టీమిండియాకు దొరకలేదనే చెప్పాలి.
యువీ తర్వాత.. నాలుగో స్థానంలో చాలా మంది బ్యాటర్లనే టీమిండియా ప్రయోగించింది. అంబటి రాయుడు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశారు. కానీ, యువీ అంత ఇంపాక్ట్ చూపించలేకపోతున్నారు. ఆ స్థానంలో పాండ్యా లాంటి సీనియర్ ప్లేయర్‌ను ఆడిస్తే.. మంచి ఫలితం ఉంటుంది. ఇక ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ తర్వాత ఆరో స్థానంలో ఫినిషర్ రోల్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను ఆడిస్తే.. టీమిండియా మరింత పటిష్టం అవుతుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మార్పుతో జట్టుకు మంచి జరగడంతో పాటు సూర్యకుమార్ యాదవ్ సైతం తనకు అచ్చొచ్చిన షినిషర్ రోల్‌లో ఆడి తిరిగి ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. వన్డేల్లో సూర్య ఫినిషర్‌గా సెట్ అయితే.. వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాకు తిరుగుండదని క్రికెట్ ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Despite a string of low scores in ODIs, Rohit Sharma has not lost faith in Suryakumar Yadav
📹 https://t.co/2WAu02DRSt pic.twitter.com/SmlzuBq4Hg
— ESPNcricinfo (@ESPNcricinfo) March 20, 2023