ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ కెమెరామెన్‌ను బూతులు తిట్టాడు. ఇందులో రోహిత్ తప్పు కంటే.. కెమెరామెన్ తప్పే ఎక్కువగా ఉంది.. మ్యాచ్‌లో రోహిత్ శర్మ కోపం.. ఆటగాళ్లపైనే కాదు ఇలాంటప్పుడు కెమెరామెన్లపై కూడా చూపిస్తాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ముక్కు మీద కోపం ఉంటుందనే విషయం తెలిసిందే. పైగా మ్యాచ్ ఆడుతున్న సమయంలో అయితే మరీ అగ్రెసివ్‌గా ఉంటాడు. ఆటగాళ్లు ఏ చిన్న తప్పు చేసినా.. అతని ఫేస్‌లో కోపం, అసహనం క్లియర్‌గా కనిపిస్తాయి. చాలా సార్లు ఆటగాళ్లపై రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్‌ల విషయంలో రోహిత్ కోపం ప్రదర్శించి విమర్శల సైతం ఎదుర్కొన్నాడు. తాజాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ కెమెరామెన్‌ను బూతులు తిట్టాడు. టీమిండియా డీఆర్‌ఎస్ కోరుకున్న సమయంలో బిగ్ స్క్రీన్‌పై రీప్లే చూపించకుండా.. రోహిత్ శర్మను ఫోకస్ చేసి చూపిస్తుండగా.. ‘నా ముఖం ఏం చూపిస్తావ్.. రిప్లే చూపించూ.. చూ**యా’ అంటూ తిట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇక ఈ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సైతం సెంచరీతో చెలరేగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను భారత్ బౌలర్లు 177 పరుగులకే ఆలౌట్ చేశారు. చాలా కాలం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన జడేజా 5 వికెట్లతో చెలరేగాడు. అతనికి తోడు అశ్విన్ సైతం 3 వికెట్లతో రాణించడంతో ఆసీస్ తొలి రోజే ఆలౌట్ అయిపోయింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో లబుషేన్ 49 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో మంచి ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఎంతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. టాపార్డర్‌లో మిగతా బ్యాటర్లు విఫలమైనా.. రోహిత్ మాత్రం సెంచరీతో కదం తొక్కాడు.
అలాగే ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ సైతం హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి.. భారత్‌కు 400 స్కోర్ అందించారు. జడేజా 70, అక్షర్ 84 రన్స్ చేశారు. వీరితో పాటు షమీ సైతం 37 రన్స్‌తో రాణించాడు. 223 పరుగుల లోటుతో రెండు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాను ఈ సారి అశ్విన్ వణికించాడు. 5 వికెట్లతో చెలరేగి.. ఆసీస్ పతనాన్ని శాసించాడు. అలాగే జడేజా 2, షమీ 2 వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో.. టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-0 లీడ్ సాధించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు మరో అడుగు ముందుకు పడింది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శనతో పాటు, రోహిత్ శర్మ కెమెరామెన్‌ను తిట్టిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mera ko kya dikha raha review dikha🤣🤣 pic.twitter.com/7UMR2RdfZu
— Lala (@FabulasGuy) February 11, 2023