ఐపీఎల్ 2022లో అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన టీమ్ ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా అత్యధిక మ్యాచ్‌లు ఓడిన జట్టుగా నిలిచింది. కానీ.. ఈ సారి ఐపీఎల్‌లో కథ వేరే ఉంటుందని అంటున్నాడు రోహత్ శర్మ..
ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో.. అంతకంటే ఎక్కువగా క్రికెటర్లు వేయిట్ చేస్తున్నారు. ఫామ్‌లో లేని ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఫామ్‌లోకి వచ్చేందుకు.. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు ఆ ఫామ్‌ను కొనసాగించేందుకు.. యువ క్రికెటర్లు తమ టాలెంట్‌ను ప్రపంచ క్రికెట్‌కు చూపించేందుకు.. సీనియర్లు తమ సత్తా చాటేందుకు ఐపీఎల్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు కొంతమంది స్టార్ ఆటగాళ్లు తమ జట్టుకు కప్ అందించడమే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నారు. మరో మూడు రోజుల్లో ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. ఈ నెల 31న అహ్మాదాబాద్ వేదికగా.. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడేబోయే మ్యాచ్‌తో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు తెరలేవనుంది.
ఇక ఈ సీజన్‌లో ఎప్పటిలాగే ముంబై ఇండియన్స్ జట్టు హాట్ ఫేవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో దారుణంగా వరుసగా 8 మ్యాచ్‌ల్లో ఓడి అత్యంత చెత్త రికార్డు నమోదు చేసుకున్న ముంబై.. ఈ సీజన్‌లో కప్పు కొట్టి ఆ గాయాన్ని మర్చిపోవాలని భావిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అదే మాట అంటున్నాడు. గతేడాది ఐపీఎల్ సీజన్‌ను మర్చిపోండి. ఈ సీజన్‌లో మాత్రం అద్భుత ప్రదర్శన ఇస్తా.. ఎందుకుంటే జట్టు అద్భుతంగా ఉందంటూ పేర్కొన్నాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, బేబీ ఏబీ బ్రేవిస్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కామెరున్ గ్రీన్‌తో ముంబై బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా ఉంది.
ఈ సారి ముంబై బ్యాటింగ్ బలంపై నమ్మకంతోనే బరిలోకి దిగుతోంది. ఆ జట్టు ఆస్థాన బౌలర్ బుమ్రా సర్జరీ కారణంగా ఐపీఎల్‌కు దూరం కావడంతో.. ముంబై బౌలింగ్ ఎటాక్ కాస్త పల్చబడిందనే చెప్పాలి. బుమ్రా జట్టులో ఉంటే.. బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించే వాడు. కానీ, ఇప్పుడు అతని గైర్హాజరీలో ఆ బాధ్యతను తీసుకుంటారో చూడాలి. ఇంగ్లండ్ పేస్ గన్ జోఫ్రా ఆర్చర్ ఈ సారి ముంబై బౌలింగ్ ఎటాక్‌కు నాయకత్వం వహించే అవకాశం ఉంది. కామెరున్ గ్రీన్ బౌలింగ్ చేస్తాడు కనుక అతనిపై కాస్త నమ్మకం పెట్టుకోవచ్చు. మరి ఈ ఐపీఎల్‌లో అదరగొడతామంటున్న రోహిత్ శర్మ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma said “I am really looking forward to the season, it’s going to be exciting, we didn’t have a good one last year but eager to change this year, we have got the players”.
— Johns. (@CricCrazyJohns) March 28, 2023