Rohit Sharma, IPL 2023: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత క్రీజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్ల మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఐపీఎల్‌లో తాను ఆడకుంటే ఐపీఎల్‌లో మజా ఉండదని రోహిత్ అంటున్నాడు..
అందరూ ఎంతగానో ఎదరు చూస్తున్న ఐపీఎల్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో నేడు (శుక్రవారం)చెన్నై సూపర్ కింగ్స్ తో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ సందర్భంగా నిన్న (గురువారం) కెప్టెన్లతో ఒక ఫోటోషూట్ నిర్వహించారు. అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ కి ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం హాజరు కాలేదు . అయితే హిట్ మ్యాన్ రాకపోవడానికి అనారోగ్యమే కారణమని తెలుస్తుంది. వర్క్ లోడ్ కారణంగా రోహిత్ శర్మ తొలి మ్యాచ్ లో విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. ఒక వేళ రోహిత్ తొలి మ్యాచ్ ఆడకుంటే.. అతని స్థానంలో సూర్య కుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుని నడిపించనున్నాడు. ఇదిలా ఉండగా..రోహిత్ శర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తతం వైరల్ గా మారాయి.
“ఫ్యాన్స్ లేకుంటే నేను లేను. నేను లేకుంటే ఐపీఎల్ కి మజా ఉండదు” అంటూ రోహిత్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. టీమిండియా కెప్టెన్ అయ్యుండి.. ఎంతో పేరు ప్రఖ్యాతలు, అభిమానులని సంపాదించుకున్న రోహిత్ శర్మ ఇలా మాట్లాడు ఏంటి? అనుకుంటే పొరపాటే అవుతుంది. అసలు విషయం ఏంటి అని ఆరాతీస్తే.. రోహిత్ శర్మ ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు. ఒక యాడ్ లో భాగంగా రోహిత్ నోటినుంచి ఈ మాటలు వినాల్సి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. ఐపీఎల్ హక్కులు ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన ఒక యాడ్‌లో రోహిత్ శర్మ నటించాడు. మరి రోహిత్ శర్మ చేసిన ఈ యాడ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma’s promo for Star Sports in IPL 2023. pic.twitter.com/PXYJN3L27N
— Johns. (@CricCrazyJohns) March 30, 2023