భారత జట్టుకు మూడు ఫార్మాట్ల కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంకతో సిరీస్‌కు ముందు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. భారత జట్టుకు భవిష్యత్తు కెప్టెన్లను అందించేందుకు జట్టులోని ఆటగాళ్లను లీడర్లుగా తయారు చేస్తానని అన్నాడు. ఇప్పుడు టీమ్‌లో కెప్టెన్‌గా, పెద్దన్నలా ఉన్న రోహిత్ శర్మ.. యువ ఆటగాళ్లను లీడర్లుగా తయారు చేస్తానని చెబుతున్నాడు. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.
‘మమ్మల్ని ఎవరో ఒకరు తీర్చిదిద్దారు. అలాగే భవిష్యత్తులో కెప్టెన్ అయ్యే సత్తా ఉన్న వాళ్లను లీడర్లుగా తీర్చిదిద్దే బాధ్యత సంతోషంగా నిర్వర్తిస్తా. రాహుల్, బుమ్రా, పంత్.. టీమ్ విక్టరీల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక సమయంలో వీళ్లు నాయకులు అవుతారు. కెప్టెన్ అవ్వడానికి బ్యాటర్, బౌలర్ అన్న తేడాలేమి లేవు. బుమ్రాను నేను దగ్గరగా చూశా. తను ఓ లీడర్‌గా తప్పకుండా రాణించగలడు’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
నేను బ్రేక్ తీసుకుంటా..
అలాగే తాను అన్ని మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని రోహిత్ స్పష్టం చేశాడు. అలసటగా అనిపిస్తే అప్పుడు బ్రేక్ గురించి ఆలోచిస్తానని తెలిపాడు. ఇక డొమెస్టిక్ ప్లేయర్లు రంజీట్రోఫీపై ఫోకస్ పెట్టాలని సూచించాడు. అక్కడ మంచి ప్రదర్శన చేస్తే టీమిండియా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని తెలిపాడు.
సూర్యకుమార్ లేకపోవడంపై..
గురువారం నుంచి శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ దూరమవ్వడంపై రోహిత్ విచారం వ్యక్తం చేశాడు. ‘సూర్యకుమారద్ యాదవ్ జట్టుకు దూరమవడం బాధాకరం. ప్రస్తుతం సూర్య మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడి స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు బెంచ్‌లో ఉన్నారు. కాబట్టి ఆందోళన అవసరం లేదు. వెస్టిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో గాయపడిన సూర్యకుమార్ యాదవ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ప్రయోగాలకు దూరం..
ఇక నుంచి తానే రెగ్యూలర్‌గా ఓపెనర్‌గా వస్తానని రోహిత్‌శర్మ స్పష్టం చేశాడు. టీ20 వరల్డ్ కప్ ఎక్కువ దూరం లేకపోవడంతో ఇక నుంచి ప్రయోగాలు చేయమని రోహిత్ తెలిపాడు. విండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ఆరంభించగా రోహిత్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అలాగే విండీస్‌తో రెండో వన్డే మ్యాచ్‌లో మిడిలార్డర్ బ్యాటర్ రిషభ్ పంత్ రోహిత్‌కు జతగా ఓపెనింగ్ చేశాడు. కాగా ఈ రెండు ప్రయోగాలు విజయవంతం కాకపోవడంతో మళ్లీ పాత ఓపెనింగ్ జోడి కొనసాగనుంది. మరి రోహిత్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇండియన్ స్టార్ ప్లేయర్ పై కీరన్ పొలార్డ్ ప్రశంసలు!