భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈ నెల 22 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లు ఆడేందుకు భారత్.. బంగ్లా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో ఓడిన భారత్.. టెస్టు సిరీస్‌లో మాత్రం బంగ్లా ఆటలు సాగనీయలేదు. చిట్టగాంగ్‌లో జరిగిన తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే.. గురువారం నుంచి ప్రారంభం అయ్యే రెండో టెస్టులోనూ గెలిచి బంగ్లాదేశ్‌ను వైట్‌వాష్ చేసి వన్డే సిరీస్ ప్రతీకారాన్ని తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే.. తొలి టెస్టుకు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేని విషయం విధితమే. బంగ్లాతో ఢాకాలో జరిగిన రెండో వన్డేలో గాయపడిన రోహిత్.. చివరి వన్డేతో పాటు, తొలి టెస్టుకు సైతం దూరం అయ్యాడు.
రెండో వన్డేలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. క్యాచ్ అందుకోబోయి రోహిత్ బొటనవేలికి గాయమైంది. వెంటనే గ్రౌండ్ వీడిన రోహిత్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఫస్ట్ ఎయిడ్ తీసుకుని.. స్కానింగ్ కోసం ఆస్పత్రికి వెళ్లాడు. చేతికి పెద్ద కట్టుతో తిరిగొచ్చిన రోహిత్ శర్మ.. ఆ తర్వాత ఫీల్డింగ్‌కు రాలేదు. అయితే.. లక్ష్యఛేదనలో తప్పని పరిస్థితుల్లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్.. హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కానీ.. అప్పటికే కావాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో.. టీమిండియా విజయానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. రోహిత్ పోరాటంపై మాత్రం ప్రశంసల వర్షం కురిసింది. ఈ మ్యాచ్ అయిన వెంటనే.. మెరుగైన వైద్యం కోసం ముంబై తిరిగి వచ్చేసిన రోహిత్.. బొటనవేలికి చికిత్స తీసుకుని కోలుకుంటున్నాడు. అయితే.. రెండో టెస్టు వరకు రోహిత్ అందుబాటులో ఉంటాడనుకుంటే.. అలా జరగలేదు.
గాయం నుంచి రోహిత్ పూర్తిగా కోలుకోకపోవడంతో రెండో టెస్టుకు సైతం దూరం అయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ రెండో టెస్టులోనూ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే.. రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా తొలి టెస్టులో విజయం సాధించింది. రెండో టెస్టులోనూ గెలిచి.. బంగ్లాదేశ్‌ను వైట్‌వాష్‌చేసి.. టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడాలని భావిస్తోంది. రోహిత్ రాకపోవడంతో.. పెద్దగా మార్పులు లేకుండానే బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టెస్టులో సెంచరీతో రాణించిన శుబ్‌మన్ గిల్.. మరోసారి కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. రోహిత్ అందుబాటులో ఉండిఉంటే.. గిల్‌కు జట్టులో చోటు దక్కడం కష్టమయ్యేది. మరి రోహిత్ రెండో టెస్టుకు సైతం దూరం కావడం, కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా రెండో టెస్టులోనూ బరిలోకి దిగనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
NEWS ALERT: Captain Rohit Sharma has been ruled out of the second Test against Bangladesh, as he is yet to recover from the thumb injury.#BANvIND #RohitSharma
— CricTracker (@Cricketracker) December 19, 2022