హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో.. బయట అంత సరదాగా ఉంటాడు. కుటుంబంతో కలిసి ఉన్నప్పుడైతే ఇంకా చాలా ఆనందంగా సరదాగా గడుపుతుంటాడు. తాజాగా తన భ్యార రితికా సజ్దేను ఓ ప్రాంక్ వీడియోతో తెగ భయపెట్టాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ స్వయంగా ఈ వీడియోను చిత్రీకరించాడు. రోహిత్ మొదట తన చేతిలో ఓ చాక్లెట్‌ను పిడికిలో ఉంచుకున్నాడు. వేరే రూంలో ఉన్న తన భార్య రితికా వద్దకు వెళ్లాడు. ఆ పిడికిలో ఏముందో చూడాలంటూ భార్యను కోరాడు.
అయితే అందులో ఏదో భయపెట్టే వస్తువు ఉండొచ్చని భావించిన రితికా.. పిడికిలిని ఓపెన్ చేయడానికి భయపడుతుంది. రోహిత్ ఎంత అడిగినా పిడికిలిని ఓపెన్ చేయకపోవడంతో.. చివరికి హిట్‌మ్యాన్ ఆ సస్పెన్స్‌ను ఓపెన్ చేశాడు. అందులో చాక్లెట్ చూసిన రితికా ఊపిరి పీల్చుకుంది. ఈ వీడియోను రోహిత్ శర్మ అభిమానులతో పంచుకున్నాడు. దీంతో నెట్టింట్లో ఈ వీడియో తెగ సందడి చేస్తోంది. వీరిద్దరూ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. ఐపీఎల్ 2021 కోసం రోహిత్ తన ఫ్యామిలీతో అక్కడ ఉన్నాడు.