టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నాలుగో టెస్టు డ్రాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న తర్వత.. రోహిత్ శర్మ, కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన టీమిండియా.. మూడో టెస్టులో ఓటమి పాలై, నాలుగో టెస్టును డ్రా చేసుకుంది. దీంతో వరుసగా నాలుగో సారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలిచింది. ఈ సిరీస్‌లో బౌలర్ల డామినేషన్ ఎక్కువగా ఉన్నా.. చివరి టెస్టులో మాత్రం బ్యాటర్లు పరుగుల వరద పారించారు. తొలి మూడు టెస్టుల్లో ఒకే ఒక సెంచరీ నమోదు అయిందంటే బౌలర్లు ఏ రేంజ్‌లో చెలరేగారో అర్థం చేసుకోవచ్చు. ఆ ఒక్క సెంచరీ కూడా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టులో చేసిందే. మళ్లీ ఉస్మాన్ ఖవాజా చివరి టెస్టులో సెంచరీతో సిరీస్‌లో రెండు సెంచరీ నమోదు చేశాడు. తొలి మూడు టెస్టుల్లో ఒక సెంచరీ నమోదైతే.. ఒక్క నాలుగో టెస్టులో ఏకంగా నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. ఉస్మాన్ ఖవాజా, కామెరున్ గ్రీన్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే.
నాలుగో టెస్టు డ్రాగా ముగిసినా కూడా టీమిండియ పటిష్ఠస్థితిలో నిలిచేందుకు విరాట్ కోహ్లీనే ప్రధాన కారణమని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ ఎలాంటి క్లాస్ ఆటగాడో అందరకి తెలిసిందే అని, అతను సెంచరీతో రాణించడం ఎంతో సంతోషంగా ఉందని రోహిత్ తెలిపాడు. అలాగే ఇటివల వైట్ బాల్ క్రికెట్‌లో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ, ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్‌లో సైతం ఫామ్‌లోకి రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. నాలుగో టెస్టులో టీమిండియా పటిష్టస్థితిలో ఉండేందుకు కోహ్లీ కారణమని రోహిత్ తెలిపాడు. దీంతో.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మెల్లమెల్లగా బెస్ట్ ఫ్రెండ్స్‌లా మారిపోతున్నారని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. వారి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు అనేక సార్లు వచ్చాయి. అయితే.. ఇటివల వారిద్దరి మధ్య పరస్పరం జరుగుతున్న సంభాషణలు చూస్తే మాత్రం అలాంటిదేం లేదని అర్థం అవుతుంది.
సోషల్ మీడియా వేదికగా కోహ్లీ-రోహిత్ అభిమానుల మధ్య తరుచుగా జరిగే ఫ్యాన్ వార్‌లు సైతం ఈ మధ్య తగ్గిపోయాయి. కోహ్లీ ఫ్యాన్స్ రోహిత్‌ను, రోహిత్ ఫ్యాన్స్ కోహ్లీని అభినందిస్తూ.. పోస్టు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా(180), గ్రీన్(114) పరుగులు చేశారు. అలాగే భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ(186), శుబ్‌మన్ గిల్(128) పరుగులతో రాణించారు. దీంతో ఐదు రోజుల పాటు సాగిన టెస్టు చివరికి డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో 186 పరుగులతో సత్తా చాటిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్దు దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అశ్విన్-జడేజా సంయుక్తంగా అందుకున్నారు. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌తో పాటు కోహ్లీపై రోహిత్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma said “Virat Kohli was the big reason behind the solid position of team in 4th Test”.
— Johns. (@CricCrazyJohns) March 13, 2023