టీమిండియా కొత్త సారధిగా రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టాక వరుస విజయాలు సాధిస్తున్నాడు. అతడి సారథ్యంలో భారత జట్టు క్లీన్‌స్వీప్‌లు చేస్తూ సత్తా చాటుతోంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ 3-0, వెస్టిండీస్ వన్డే సిరీస్ 3-0, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ 3-0, శ్రీలంకతో టీ20 సిరీస్ 3-0, శ్రీలంకతో టెస్టు సిరీస్ 2-0.. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. అరగంటలో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల సత్తా అతని సొంతమంటూ ఆకాశానికెత్తాడు. రోజురోజుకూ అతడు ఎదుగుతున్న తీరు అమోఘమంటూ కొనియాడాడు.
బెంగళూరు టెస్టు విజయానంతరం రోహిత్ మాట్లాడుతూ.. పంత్ కు దూకుడుగా ఆడటమంటే ఇష్టం. అతనిని అలానే దూకుడుగా ఆడే స్వేచ్ఛనిచ్చామని తెలిపాడు. అయితే.. కొన్ని పరిస్థితుల్లో అనవసరపు షాట్ల వల్ల అవుట్ కావడం జట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా వివరించాం. గేమ్‌ప్లాన్ అమలులో తేడాలు రాకుండా చూసుకోవాలని చెప్పాం. అనవసర షాట్ కు ప్రయత్నిస్తూ అవుట్ అయ్యాక.. అరే ఈ షాట్ ఎందుకు ఆడానని పశ్చాత్తాపపడే పరిస్థితి రాకూడదని చెప్పాం. 30 నుంచి 40 నిమిషాలు సీరీజులో ఉన్నదంటే.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల సత్తా అతడి సొంతం. అందుకే తన ఆట తీరు ఎలా ఉన్నా స్వీకరించే స్థితిలో ఉన్నాం’’ అని రోహిత్ శర్మ పంత్‌కు మద్దతుగా నిలిచాడు.
ఇది కూడా చదవండి: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ పై వేటు?
శ్రీలంకతో.. మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో 97 బంతుల్లో 96 పరుగులతో చెలరేగిన పంత్.. రెండో టెస్టులో వరుసగా 39, 50 పరుగులతో పర్వాలేదనిపించాడు. తద్వారా 120 స్ట్రైక్‌రేట్‌తో సిరీస్‌లో 185 పరుగులు చేసిన పంత్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. ఇక ఐపీఎల్ లో.. పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. గత సీజన్ లో లీగ్ మ్యాచుల్లో అగ్రస్థానాన నిలిచిన ఢిల్లీ జట్టు.. టైటిల్ విన్నర్ గా మాత్రం నిలవలేకపోయింది. ఈసారి ఆ తప్పులు పునరావృతం కాకుండా చాంపియన్స్ గా నిలుస్తామంటోంది. గత 14 ఎడిషన్లలో ఒక్కసారి కూడా టైటిల్ విన్నర్ గా నిలవని ఢిల్లీ.. ఈ ఏడాది ట్రోఫీని సాధించాలని మనమూ ఆశిద్దాం.
🗣️ 🗣️ #TeamIndia captain @ImRo45 speaks about the experience and learnings on leading the side for the first time in a Test series. 👍 👍#INDvSL | @Paytm pic.twitter.com/41EuDxyDrG
— BCCI (@BCCI) March 14, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.